ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Congress: పార్టీలకతీతంగా అభివృద్ధి ఫలాలు.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తగ్గం: రేవంత్

ABN, Publish Date - Sep 18 , 2024 | 03:40 PM

కాంగ్రెస్ సర్కార్ పార్టీలకతీతంగా అభివృద్ధి ఫలాలను అందజేస్తోందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన ఎంఎస్‌ఎంఈ (MSME) పాలసీ-2024ని బుధవారం ప్రారంభించింది.

హైదరాబాద్: కాంగ్రెస్ సర్కార్ పార్టీలకతీతంగా అభివృద్ధి ఫలాలను అందజేస్తోందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన ఎంఎస్‌ఎంఈ (MSME) పాలసీ-2024ని బుధవారం ప్రారంభించింది. మాదాపూర్ శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. "రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు MSME లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర సంపదను పెంపొందించాలనే ఉద్దేశంతోనే MSME పాలసీ-2024 ను ఆవిష్కరించాం. దేశ ఆర్థికస్థితి దెబ్బతిన్న కాలంలో నాటి ప్రధాని పీవీ నరసింహారావు దూరదృష్టితో ఆలోచించారు. పారిశ్రామిక విధానంలో సరళీకృత విధానాలు తీసుకొచ్చి ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టారు. ప్రపంచంతో పోటీ పడేలా విధి విధానాలు రూపొందించారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు మంత్రి శ్రీధర్ బాబు గొప్ప ఆలోచన చేశారు. ఆయనకు నా అభినందనలు. పాలసీ డాక్యుమెంట్ లేకుండా ఏ రాష్ట్రం అభివృద్ధి సాధించదు. అందుకే తాజా పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చింది. గత ప్రభుత్వ విధానాలను కొనసాగిస్తూనే... కొత్త పాలసీని ముందుకు తీసుకెళ్తాం. ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ.. అభివృద్ధి విషయంలో ఎలాంటి రాజకీయాలు లేవు.


కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తోంది. మంచి పనులు ఎవరు చేసినా వాటిని కొనసాగిస్తాం. రాష్ట్ర ప్రయోజనానికి విఘాతం కలిగించే అంశాలపై చర్యలు తీసుకునే విషయంలో వెనకాడబోం. ప్రస్తుతం చదివిన చదువుకు, పారిశ్రామిక అవసరాలకు మధ్య అంతరం ఏర్పడింది. అందుకే రాష్ట్రంలోని 65 ఐటీఐలను అధునాతన టెక్నాలజీ సెంటర్లుగా మార్చాం. టాటా ఇనిస్టిట్యూట్‌తో కలిసి వాటిని రూ.2 వేల 400 కోట్లతో ఆధునీకరిస్తున్నాం. పూర్తి అధ్యయనం తరువాత యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసాం. ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం అందించేలా యువతకు శిక్షణ ఇవ్వనున్నాం. యూనివర్సిటీ నిర్వహణకు పారిశ్రామిక వేత్తల నుంచి రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయబోతున్నాం. వీటిని యూనివర్సిటీ నిర్వహణకు ఖర్చు చేసేలా ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేసింది. ప్రభుత్వం చేస్తున్న ఈ పని రాజకీయ ప్రయోజనాల కోసం కాదు" అని సీఎం పేర్కొన్నారు.


అగ్రికల్చర్ అనేది మన కల్చర్..

రైతన్నలు వ్యవసాయాన్ని వదలవద్దని సీఎం రేవంత్ కోరారు. కాంగ్రెస్ వచ్చాక వ్యవసాయాన్ని పండగ చేసి చూపించినట్లు చెప్పారు. "రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసి వ్యవసాయం పండగ అని నిరూపించాం. అయినా వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయం రైతుల కుటుంబాలకు సరిపోవడంలేదు. తెలంగాణ రైతాంగానికి ఈ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నా. వ్యవసాయాన్ని వదలొద్దు.. అగ్రికల్చర్ అనేది మన కల్చర్.. వ్యవసాయం చేసే వాళ్లు వ్యవసాయం చేస్తూనే కుటుంబ సభ్యులను ఉపాధి అవకాశాలవైపు మళ్లించండి. వ్యాపారాల్లో రాణించేలా తీర్చిదిద్దండి. హైదరాబాద్‌లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయబోతున్నాం.


ఫ్యూచర్ సిటీలో లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఫార్మా ఏర్పాటు చేస్తాం. మూసీ అంటే మురికి కూపం కాదు. మూసీని మ్యాన్ మేడ్ వండర్‌గా తీర్చిదిద్దుతాం. మా ప్రభుత్వం గత ప్రభుత్వంలా గడీల మధ్య లేదు. ప్రజల కోసమే పని చేసే సర్కారిది. ప్రజలకు ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయి. అందరి సలహాలు, సూచనలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. స్వయంసహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులను చేసే ప్రయత్నం చేస్తున్నాం. శిల్పారామంలో 3 ఎకరాల స్థలంలో స్వయం సహాయక మహిళల ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం సదుపాయం కల్పిస్తున్నాం. అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో నిర్వహణ మహిళల చేతుల్లోపెట్టాం. మహిళా సంఘాలకే స్కూల్ యూనిఫామ్ కుట్టు పని బాధ్యతలు ఇచ్చాం. యూనిఫామ్ ధరను రూ.25 నుంచి రూ.75 చేసి ఆడబిడ్డలను ఆర్థికంగా ఆదుకుంటున్నాం. MSMEలు బలపడితేనే రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. వాటికి సంపూర్ణంగా సహకరిస్తాం" అని రేవంత్ రెడ్డి తెలిపారు.

For Latest News and National News click here

Updated Date - Sep 18 , 2024 | 03:40 PM

Advertising
Advertising