సీఎంను కలిసిన వికారాబాద్‌ కలెక్టర్‌

ABN, Publish Date - Jun 23 , 2024 | 11:27 PM

వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా నియామకమైన ప్రతీక్‌ జైన్‌ ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.

సీఎంను కలిసిన వికారాబాద్‌ కలెక్టర్‌
సీఎం రేవంత్‌రెడ్డికి పూలమొక్క బహూకరిస్తున్న కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌

వికారాబాద్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి) : వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా నియామకమైన ప్రతీక్‌ జైన్‌ ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గం వికారాబాద్‌ జిల్లా పరిధిలో ఉన్న నేపథ్యంలో కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ సీఎం రేవంత్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి పూల మొక్క అందజేశారు. తనను వికారాబాద్‌ కలెక్టర్‌గా నియమించినందుకు ప్రతీక్‌ జైన్‌ సీఎంకు ఽకృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి చేరే విధంగా కృషి చేయాలని సీఎం కలెక్టర్‌ను ఆదేశించారు.

Updated Date - Jun 23 , 2024 | 11:27 PM

Advertising
Advertising