పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం : వీరేశం
ABN, Publish Date - Nov 29 , 2024 | 11:44 PM
పేదలకు అండ గా తమ ప్రభు త్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే వే ముల వీరేశం అన్నారు.
పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం : వీరేశం
నార్కట్‌పల్లి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): పేదలకు అండ గా తమ ప్రభు త్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే వే ముల వీరేశం అన్నారు. నార్కట్‌పల్లి మండల పరిషత కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను శుక్రవారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలను అమలుపరిచే దిశగా తమ ప్రభు త్వం ముందుకెళ్తున్నట్లు తెలిపారు. అనారోగ్యానికి గురైన బాఽధితులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు పొందవచ్చని ఆయన సూచించారు. వచ్చే నెలలో ముఖ్యమంత్రి రేవంతరెడ్డి చేతుల మీదుగా బీ.వెల్లెంల ఉదయసముద్రం ఎత్తిపోతల పథకా న్ని ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అ ధ్యక్షుడు బత్తుల ఊశయ్య, మండల ప్రత్యేక అధికారి చరిత, తహసీల్దార్ ఎల్.వెంకటేశ్వర్‌రావు, ఎంపీడీవో ఉమేష్, సట్టు సత్తయ్య, బండ సాగర్‌రెడ్డి, రేగట్టె నర్సిరెడ్డి, బింగి కొండయ్య, మహేష్, భరత, శశిధర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, సైదులు, స్వామి పాల్గొన్నారు.
సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
చిట్యాల: ముఖ్యమంత్రి రిలీ్‌పఫండ్ చెక్కులు నిరుపేదలకు ఆసరాగా నిలుస్తున్నా యని ఎమ్మెల్యే వీరేశం తెలిపారు. చిట్యాల ఎంపీడీవో కార్యాలయంలో సీఎం రిలీప్ ఫండ్ చెక్కులు అందజేశారు. ప్రజాపాలన విజయోత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీవో జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 29 , 2024 | 11:44 PM