ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్‌

ABN, Publish Date - Apr 30 , 2024 | 11:31 PM

బడుగు బలహీన వర్గా ల పార్టీ కాంగ్రెస్‌ అని ఎక్సైజ్‌, పురావస్తు, పర్యా టక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

- ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

కోడేరు, ఏప్రిల్‌ 30 : బడుగు బలహీన వర్గా ల పార్టీ కాంగ్రెస్‌ అని ఎక్సైజ్‌, పురావస్తు, పర్యా టక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం కోడేరు మండల కేంద్రంలో పార్ల మెంట్‌ ఎన్నికల సందర్భంగా మండల కాంగ్రెస్‌ కార్యకర్తలతో సన్నాహాక సమావేశం నిర్వహించా రు. ముఖ్య అతిథిగా ఎక్సైజ్‌, పురావస్తు, పర్యాట క శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరై మా ట్లాడారు. ప్రతీ కార్యకర్త ఈ పార్లమెంట్‌ ఎన్నిక ల్లో సైనికుల్లా పని చేసి కాంగ్రెస్‌ పార్టీ బలప ర్చిన అభ్యర్థి మల్లురవిని అధిక మెజార్టీతో గెలి పించాలన్నారు. రాష్ట్రంలో మిగులు బడ్జెట్‌గా ఉన్న మన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, కుటుంబ పాలనతో అవినీతి, అక్రమం గా రాష్ట్రాన్ని నిలువునా ముంచారని విమర్శించా రు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వవద్దని ఆంధ్రా నా యకులు గట్టిగా పట్టుబట్టిన ఇచ్చిన మాట కోసం సోనియమ్మ మనకు తెలంగాణ రాష్ట్రం ఇ చ్చిందని అందుకు కృతజ్ఞతగా కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు. ప్రతి కార్యకర్త ఇంటింటికి తిరిగి కాంగ్రెస్‌ పార్టీ సంక్షేమ పథకాలను వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కే.రామ్మోహన్‌రావు, సింగిల్‌ విండో డైరెక్టర్‌ మహేశ్వర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మిద్దె శాంతయ్య, బావాయిపల్లి మాజీ సర్పంచ్‌ ఎన్‌వీ.ఫౌండేషన్‌ చైర్మన్‌ వేణుగోపాల్‌, కో ఆప్షన్‌ మెంబరు అబ్దుల్‌ కరీం, కాంగ్రెస్‌ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2024 | 11:36 PM

Advertising
Advertising