ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఒవైసీ సోదరులను హతమార్చే కుట్ర!

ABN, Publish Date - Apr 17 , 2024 | 03:40 AM

మజ్లిస్‌ పార్టీ శాసనసభాపక్ష నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఒవైసీ సోదరులు ఏదైనా కేసులో జైలుకు వెళితే అక్కడ

అక్బరుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

చార్మినార్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): మజ్లిస్‌ పార్టీ శాసనసభాపక్ష నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఒవైసీ సోదరులు ఏదైనా కేసులో జైలుకు వెళితే అక్కడ విషం పెట్టి లేదా చికిత్స పేరుతో ఆస్పత్రికి తీసుకొని వెళుతూ కాల్చి చంపేందుకు కుట్ర జరుగుతోంది’’ అని ఆరోపించారు. యాకుత్‌ పురాలో సోమవారం రాత్రి జరిగిన ఈద్‌ మిలాప్‌ కార్యక్రమానికి హాజరైన అక్బరుద్దీన్‌.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో పోలీసుల కాల్పులో షాబుద్దీన్‌ మృతి చెందగా, ఆస్పత్రికి చికిత్స కోసం వెళ్లి వస్తున్న అతిక్‌ సోదరులను కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ముక్తార్‌ అన్సారీకి జైల్లో విషం పెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో అక్బరుద్దీన్‌ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈద్‌ మిలా్‌పలో అక్బరుద్దీన్‌ మాట్లాడుతూ.. తనతో పాటు అన్న అసదుద్దీన్‌ ఒవైసీని హతమార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. 13 ఏళ్ల కిందట ఇదే నెలలో తనపై హత్యాయత్నం జరిగిందని గుర్తుచేశారు. అప్పుడు ప్రజలు కులమతాలకతీతంగా ప్రార్థనలు చేయడం వల్లే తాను బతికి బయటపడ్డానని చెప్పారు. పాతబస్తీ ప్రజలు ఆలోచించుకోవవాలని, తమ (ఒవైసీ సోదరులు)ను హత్య చేస్తే.. వారికి ఎవరు అండగా ఉంటారని అడిగారు. హైదరాబాద్‌ ప్రజల మద్దతు, ఆశీస్సులతోనే తాము ఈ స్థాయికి వచ్చామని తెలిపారు. తమ వల్ల ఏమైనా తప్పులు జరిగి ఉంటే క్షమించాలని కోరారు. దేశవ్యాప్తంగా మజ్లిస్‌ పార్టీ ఎదగడాన్ని తట్టుకోలేని కొందరు నేతలు మజ్లి్‌సను బీజేపీకి బీ టీమ్‌ అంటూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు సంఘటితంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి అసదుద్దీన్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Updated Date - Apr 17 , 2024 | 03:40 AM

Advertising
Advertising