ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ధర్మపురి క్షేత్రంలో కార్తీక భక్తుల సందడి

ABN, Publish Date - Nov 21 , 2024 | 12:49 AM

ధర్మపురి క్షేత్రంలో బుధవారం కార్తీక భక్తుల సందడి నెలకొం ది. స్థానిక లక్ష్మీ నృసింహ స్వామి, అనుబంధ రామలింగేశ్వ స్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. గోదావరి నదిలో భక్తులు కార్తీక స్నానాలు ఆచరించారు.

ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం కోసం క్యూలైన్‌లో వేచి ఉన్న భక్తులు

నదిలో దీపాలు వదిలిన మహిళలు

ధర్మపురి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ధర్మపురి క్షేత్రంలో బుధవారం కార్తీక భక్తుల సందడి నెలకొం ది. స్థానిక లక్ష్మీ నృసింహ స్వామి, అనుబంధ రామలింగేశ్వ స్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. గోదావరి నదిలో భక్తులు కార్తీక స్నానాలు ఆచరించారు. నదిలో కార్తీక దీపాలు వదిలారు. నరసింహుని ఆ లయంలో భక్తులు అభిషేకాది పూజలు, కుంకుమార్చన, స్వామి వారల నిత్య కల్యాణం జరిపించి పూజలు చేశారు. స్వామి వారలకు ఆలయ వేద పండితులు బొజ్జ రమేష్‌ శర్మ, వేద పారాయణదారు పాలెపు ప్రవీణ్‌కుమార్‌శర్మ నిత్య పూజలు, అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించారు. శేషప్ప కళావేదికపై బ్రహ్మశ్రీ పాలెపు భరత్‌శర్మచే కార్తీక పురాణ ప్రవచనాలు చేశారు. భరత్‌శర్మను ఆలయం పక్షాన స్వామి శేష వస్త్ర, ప్రసాదాలు బహుకరించి సన్మానించారు.

19 వ రోజు ఘనంగా గోదావరి హారతి

కార్తీక మాసం పురస్కరించుకుని ధర్మపురి వద్ద గోదావరి హారతి 19 వ రోజు బుధవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఆలయ వేదపండితులు, అర్చకులు, సిబ్బంది, భక్తులు, మహిళలు మంగళ గోదావరి నది వరకు శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం నదీ మాతకు హారతి ఇచ్చి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్‌, సూపరింటెండెంట్‌ ద్యావళ్ల కిరణ్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ అలువాల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2024 | 12:49 AM