ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ప్రజలపై పన్నుల భారం మోపం

ABN, Publish Date - Apr 21 , 2024 | 04:35 AM

ప్రభుత్వ రాబడుల్లో లీకేజీలను అరికడుతూ ప్రజలపై అదనంగా ఎలాంటి పన్నుల భారం మోపకుండా తమ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్తు శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. అధిక ఆదాయాన్ని తెచ్చి పెట్టే వాణిజ్య పన్నులు,

అదనపు రాబడి మార్గాలను అన్వేషిస్తున్నాం

ఉద్యోగులకు 1వ తేదీనే వేతనాలు ఇస్తున్నాం

4 నెలల్లో తీసుకున్న అప్పు 17,615 కోట్లే

అసలు, వడ్డీ.. 26,374 కోట్లు చెల్లించాం

ఇప్పటిదాకా 29,370 పోస్టుల భర్తీ

ఎన్నికల కోడ్‌ ముగియగానే రుణ మాఫీ

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ రాబడుల్లో లీకేజీలను అరికడుతూ ప్రజలపై అదనంగా ఎలాంటి పన్నుల భారం మోపకుండా తమ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్తు శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. అధిక ఆదాయాన్ని తెచ్చి పెట్టే వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌ శాఖల రాబడుల్లో ఎలాంటి లొసుగులు లేకుండా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా అధికారిక తప్పిదాలు లేకుండా చూడడం, పన్ను ఎగవేతలను అరికట్టడం, పాత బకాయిలను వసూలు చేయడం వంటి చర్యల ద్వారా రాబడులను పెంచడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రస్తుత ఉన్నవే కాకుండా... ఇతర రాబడి మార్గాలనూ అన్వేషిస్తున్నామన్నారు. ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు అందిస్తున్నామని, అదే సమయంలో ప్రజా సంక్షేమ పథకాలకు నిధుల చెల్లింపులను ఆపడం లేదని వివరించారు. గత డిసెంబరు నుంచి ఈ ఏప్రిల్‌ 15 వరకు రూ. 66,507 కోట్లను వ్యయం చేశామని వివరించారు. ఇందులో ఉద్యోగుల వేతనాలకు రూ. 22,328 కోట్లు, ప్రభుత్వ అప్పులకు సంబంధించి అసలు, వడ్డీ చెల్లింపులకు రూ.26,374కోట్లు వెచ్చించామని వెల్లడించారు. రైతుభరోసా కింద రూ.5,575 కోట్లు, చేయూత పథకానికి రూ.3,840 కోట్లు, మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి రూ. 1,125 కోట్లు, గృహజ్యోతి కింద విద్యుత్తు సబ్సిడీకి రూ.200 కోట్లు, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ కింద రూ.189 కోట్లు, మహాలక్ష్మి(గ్యాస్‌ సబ్సిడీ) కింద రూ.80 కోట్లు, వ్యవసాయ విద్యుత్తు సబ్సిడీకి రూ.3,924 కోట్లు, బియ్యం సబ్సిడీకి రూ.1,147 కోట్లు, రైతు బీమాకు రూ.734 కోట్లు, డైట్‌ చార్జీలకు రూ.418 కోట్లు, మధ్యాహ్న భోజనం కింద రూ.52 కోట్లు, అంగన్‌వాడీ సిబ్బంది వేతనాలకు రూ.69 కోట్లు, హోంగార్డ్స్‌ వేతనాలకు రూ.186 కోట్లు, డ్వాక్రా మహిళలకు రూ.267 కోట్లు... మొత్తం రూ.66,507 కోట్లను వెచ్చించామని వివరించారు. రైతు భరోసా పథకం కింద 5 ఎకరాల లోపు ఉన్న 64,75,319 మంది రైతులకు రూ.5,575 కోట్లను చెల్లించామన్నారు. ఎన్నికల కోడ్‌ ముగియగానే రైతు రుణమాఫీ అమలు చేస్తామని ప్రకటించారు.

లోటు బడ్జెట్‌తో రాష్ట్రాన్ని అప్పగించారు

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తమకు రూ.3,960 కోట్ల లోటుతో ఆర్థిక శాఖను అప్పగించిందని భట్టి విమర్శించారు. అయినా... తాము తక్కువ అప్పులు తీసుకుని, ఎక్కువ మొత్తంలో అసలు, వడ్డీ చెల్లింపులు జరిపామన్నారు. డిసెంబరు నుంచి ఏప్రిల్‌ 15 వరకు రూ.17,615 కోట్ల అప్పులు తీసుకోగా... గత ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించి అసలు, వడ్డీల కింద రూ.26,374 కోట్లను చెల్లించామని వివరించారు. మూలధన వ్యయం కింద రూ.7,135 కోట్లను వెచ్చించామన్నారు. వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను కూడా ప్రాధాన్య క్రమంలో చెల్లిస్తున్నామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 11,062 టీచర్‌ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేశామని భట్టి గుర్తు చేశారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 503 పోస్టులతో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ఇచ్చిందని, కానీ... తాము మరో 64 పోస్టులను అదనంగా జత చేసి, 563 పోస్టులతో రివైజ్డ్‌ నోటిఫికేషన్‌ను జారీ చేశామని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖలో 5,378 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, డిసెంబరు 7న తమ ప్రభుత్వం ఏర్పాటయ్యాక... మొత్తం 29,370 పోస్టులను భర్తీ చేసిందని, ఈమేరకు అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు కూడా అందజేసిందని వివరించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో కమీషన్ల కోసమే యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ ప్లాంట్ల నిర్మాణం చేపట్టారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. త్వరలో కొత్త విద్యుత్‌ పాలసీ తేనున్నామన్నారు. రానున్న రోజుల్లో కరెంట్‌ బిల్లులను పెంచబోమన్నారు.

Updated Date - Apr 21 , 2024 | 04:35 AM

Advertising
Advertising