ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పంపకాల ‘పంచాయితీ’

ABN, Publish Date - Nov 23 , 2024 | 11:46 PM

పెరిగిన భూముల ధరలు కుటుంబాల్లో చిచ్చు రేపుతున్నాయి.

మూడు రోజులుగా అత్యక్రియలు జరుగక ఫ్రీజర్‌లో ఉన్న బాలయ్య భౌతిక కాయం

మూడు రోజులు ఆగిన తండ్రి అంత్యక్రియలు

భూమి పంపకాలు చేస్తేనే అంత్యక్రియలని అడ్డుకున్న కుమారుడు

పోలీసుల జోక్యంతో కుదిరిన ఒప్పందం

మూడు రోజుల తర్వాత తండ్రికి అంత్యక్రియలు

యాదాద్రిభువనగిరి జిల్లాలో ఘటన

మోత్కూరు, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): పెరిగిన భూముల ధరలు కుటుంబాల్లో చిచ్చు రేపుతున్నాయి. ఏళ్ల తరబడి పరిష్కారం కాని భూ పంచాయితీలను సంబంధీకులు మృతి చెందినప్పుడు అంత్యక్రియలు జరగకుండా అడ్డుకుంటున్నారు. ఈ సమయం తప్పితే తమకు రావాల్సి ఆస్తి రాదని అనుబంధాలను కూడా పక్కన పెడుతున్నారు. తాజాగా యాదాద్రిభువనగిరి జిల్లా మోత్కూరు మండలంలోని సదర్శాపురం గ్రామంలో ఇలాంటి ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. సోదరుడితో ఉన్న భూ తగాదాను పరిష్కరించుకోవడానికి ఓ కుమారుడు తన తండ్రి భౌతికకాయానికి అంత్యక్రియలు జరగకుండా మూడు రోజులు ఆపాడు. గ్రామస్థుల కథనం ప్రకారం... సదర్శాపురం గ్రామానికి చెందిన ఆలకుంట్ల బాలయ్య, లింగమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు నరేష్‌ తాటిపాముల గ్రామానికి చెందిన మేనత్త కుమార్తెను వివాహం చేసుకున్నాడు. అయితే బాలయ్య పెద్ద కోడలు గ్రామం అయిన తాటిపాములలో భూమిని కొనుగోలు చేసి పెద్ద కోడలు పేరునే పట్టా చేయించాడు. ఈ భూమిలో చిన్న కుమారుడు సురేష్‌కు ఎలాంటి భాగం ఇవ్వలేదు. బాలయ్య తనకు సదర్శాపురం గ్రామంలో ఉన్న భూములను ఇద్దరు కుమారులకు పంచాడు. తాటిపాముల గ్రామంలో ఉన్న ఒక ఎకరం పది గుంటల భూమిలో సురే్‌షకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా పెద్ద కుమారుడు నరేష్‌, అతని భార్య తగదా పడుతున్నారు. తల్లిదండ్రులు, పెద్ద మనుషులు చెప్పినా వారు వినలేదు. ఈ తగాదా రెండు, మూడేళ్లుగా నడుస్తోంది. ఈ నెల 21న సాయంత్రం బాలయ్య(65) అనారోగ్యంతో మృతిచెందాడు. 22న అంత్యక్రియలు నిర్వహించడానికి యత్నించగా భూమిలో తనకు రావాల్సిన వాటా ఇస్తానని కాగితం రాసిస్తేనే తండ్రికి నరే్‌షను తలకొరిపి పెట్టనిస్తానని, అంతవరకు అంత్యక్రియలు జరగనివ్వనని చిన్న కుమారుడు సురేష్‌, అతని భార్య అడ్డుకున్నారు. తండ్రి ఆస్తిలో అతనికి వాటా ఎందుకు ఇవ్వరని పెద్దకుమారుడిని, అతని భార్యను గ్రామస్థులు నిలదీయడంతో ఇస్తామని శుక్రవారం సాయంత్రం అంగీకరించారు. అప్పటికే పొద్దుపోవడంతో శనివారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించడానికి భూమిలో వాటా ఇస్తానని కాగితం రాసి ఇవ్వాలని చిన్న కుమారుడు సురేష్‌ కోరగా, వారు మళ్లీ తిరగబడ్డారు. మూడు రోజులవుతున్నా అంత్యక్రియలు నిర్వహించకుండా అలానే ఉంచడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రామన్నపేట సీఐ వెంకటేశ్వర్లు, మోత్కూరు ఎస్‌ఐ డి.నాగరాజు తమ సిబ్బందితో వెళ్లి ఇరువర్గాలను కూర్చోబెట్టి మాట్లాడారు. ఎట్టకేలకు పెద్దకుమారుడు నరేష్‌ తనకు ఎక్కువగా ఉన్న భూమిని పంచి ఇచ్చేలా ఒప్పందం కుదిర్చి కాగితాలు రాయించారు. దీంతో శనివారం సాయంత్రం తండ్రి బాలయ్య భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు.

Updated Date - Nov 23 , 2024 | 11:46 PM