ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కాల్వలో పడి వృద్ధురాలి మృతి

ABN, Publish Date - Nov 30 , 2024 | 12:00 AM

పెద్దఅడిశర్లపల్లి, నవంబరు29(ఆంధ్రజ్యోతి): ప్రమాదవశాత్తు ఏ ఎమ్మార్పీ ప్రధాన కాల్వలో పడి వృద్ధురాలు మృతిచెందింది .

పెద్దఅడిశర్లపల్లి, నవంబరు29(ఆంధ్రజ్యోతి): ప్రమాదవశాత్తు ఏ ఎమ్మార్పీ ప్రధాన కాల్వలో పడి వృద్ధురాలు మృతిచెందింది .ఈ ఘటన నల్లగొండ జిల్లా గుడిపల్లి మండలం సింగరాసిపల్లి గ్రామ శివారులో శుక్రవారం వెలుగు చూసింది. గుడిపల్లి ఎస్‌ఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దఅడిశర్లపల్లి మండలం చింతల్‌తండాకు చెందిన రమావత్‌ కొటాలి (85) గుడిపల్లి మండలం కేశంనేనిపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న చిన్న కొడుకు రమావత్‌ పాండు భూమి కౌలుకు తీసుకుని సాగు చేస్తుం డగా అతడి వద్దకు వచ్చి ఉంటుంది. కోటాలికి కంటి చూపు తగ్గి వృద్ధా ప్యంతో మతిస్థిమితం సరిగ్గా లేక ఈ నెల 26న ఇంటి నుంచి చెప్పకుం డా వెళ్లి పోయింది. దీంతో కుటుంబసభ్యులు వెతికిన ఆచూకీ లభించకపోవడంతో చివరికి గుడిపల్లి పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఉదయం సింగరాసిపల్లి గ్రామ శివారులోని ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వలో మృతదేహం లభ్యం కావడంతో కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతురాలు కుమారుడు పాండు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహానికి పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ మార్చురీకి తరలించినట్లు ఎస్‌ఐ నర్సింహులు తెలిపారు.

Updated Date - Nov 30 , 2024 | 12:00 AM