ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ముగిసిన బస్తాల పంచాయితీ

ABN, Publish Date - Oct 22 , 2024 | 12:38 AM

తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌లో వ్యాపారులు, హ మాలీల మధ్య బస్తాల పంచాయితీ ముగిసింది.

తిరుమలగిరి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌లో వ్యాపారులు, హ మాలీల మధ్య బస్తాల పంచాయితీ ముగిసింది. ఈ నెల 16వ తేదీన ప్లాస్టిక్‌ బస్తాల్లో ధాన్యం కొనుగోళ్లు చేపట్టమని హమాలీలు మొండికేశారు. దీంతో కొనుగోళ్లు నిలిచాయి. అటు వ్యాపారులు గన్నీ బ్యాగులు లేవని టెండర్లు వేయలేదు. దీంతో రైతులు ఆందోళన చేశారు. అయినప్పటికీవ్యాపారులు,హమాలీలు ఎవరి మాటపై వారు పట్టుదలతో ఉండటంతో పలు పర్యాయాలు చర్చలు జరిపారు. ఎమ్మె ల్యే సామేల్‌ ఇరువర్గాల వారితో చర్చించారు. అనంతరం మార్కెట్‌ అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు ఖరీదుదారులు, హమాలీ సంఘాలతో సమావేశమై సమస్యను పరిష్కరించారు. 80శాతం గన్నీ బస్తాలు, 20శాతం ప్లాస్టిక్‌ బ స్తాల ద్వారా తూకాలు జరిపేందుకు హమాలీలు అంగీకరించారు. దీంతో సోమవారం నుంచి మార్కెట్‌లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ధాన్యం తూకం కోసం గన్నీ బస్తాలతో పాటు ప్లాస్టిక్‌ బస్తాలు సమకూర్చారు. కొనుగోళ్లు సాఫీగా సాగాయని, ఇక మీదట సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని మార్కెట్‌ కార్యదర్శి శ్రీధర్‌ తెలిపారు.

సోమవారం 10 వేల బస్తాల ధాన్యం

తిరుమలగిరి మార్కెట్‌కు సోమవారం 200 మంది రైతులు 10,692 బస్తాల్లో 6,842 క్వింటాళ్ల దాన్యం తీసుకువచ్చారు. వీటిలో ఆర్‌ఎన్‌ఆర్‌ రకం 180 బస్తాల్లో 115 క్వింటాళ్లు రాగా గరిష్టంగా రూ.2,163, కనిష్టంగా రూ.1,223 ధరలు పలికాయి. ఎస్‌ఎం రకం 1,030 బస్తాల్లో, 659 క్వింటాళ్ల ధాన్యం రాగా గరిష్టంగా రూ.3,089, కనిష్టంగా రూ.2,003 ధరలు రాగా, ఐఆర్‌-64 రకం 9482 బస్తాల్లో 6,068 క్వింటాళ్ల ధాన్యం రాగా గరిష్టంగా రూ.1,992, కనిష్టంగా రూ.1,870 ధరలు నమోదైనట్లు మార్కెట్‌ కార్యదర్శి శ్రీధర్‌ తెలిపారు.

అదనపు ధాన్యం ఇవ్వొద్దు

తిరుమలగిరి మార్కెట్‌లో అధికారులు ఏర్పాటుచేసిన పెక్ల్సీపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం తూకం వేసే సమయంలో రైతుల నుంచి దడవాయి, హమాలీలు, స్వీపర్లు ధాన్యం తీసుకోవద్దని, తీసుకుంటే కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని ఫ్లెక్సీలో పేర్కొన్నారు. కొన్నేళ్లుగా మార్కెట్‌కు పంటలను తీసుకొస్తున్నామని, తూకం సమయంలో డిమాండ్‌ చేసి ధాన్యం తీసుకుంటున్నారని రైతులు తెలిపారు. ఇన్నాళ్లకు అధికారులు స్పందించి వారిని హెచ్చరించడం సంతోషం కలిగిస్తోందన్నారు.

Updated Date - Oct 22 , 2024 | 12:38 AM