ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు
ABN, Publish Date - Nov 20 , 2024 | 11:18 PM
ఈ నెల 14 నుంచి నిర్వహించిన 57వ జాతీ య గ్రంథాయల వారోత్సవాలు బుధవారంతో ముగిశాయి.
నాగర్‌కర్నూల్ టౌన్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 14 నుంచి నిర్వహించిన 57వ జాతీ య గ్రంథాయల వారోత్సవాలు బుధవారంతో ముగిశాయి. జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో నిర్వహించిన ముగింపు వేడుక లకు జిల్లా పంచాయతీ అధికారి రామ్మోహన్‌రావుతో పాటు ముని సిపల్ చైర్ పర్సన్ కల్పన ముఖ్య అతిథిగా హాజరై వివిధ అంశాల్లో నిర్వహిం చిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహు మతులు అందజేశారు. స్థానిక సీఎన్‌ఆర్ పాఠ శాల విద్యార్థులు ఉపన్యాసం, చిత్రలేఖనం, వ్యాసరచణ, రంగోలి పోటీల్లో ప్రతీభ కనబరిచి బహుమతులు అందుకున్నారు. ఉపన్యాసంలో 9వ తరగతి విద్యార్థులు వెంకటాక్షయ, వ్యాస రచనలో ఇస్రాత్ బేగం, అస్మ, రంగోలిలో సు కృత, అమృష, చిత్ర లేఖనంలో హుదా ద్వి తీయ బహుతి గెలుచుకున్నారు. ఈ సంద ర్భంగా జిల్లా పంచాయతీ అధికారి రామ్మో హన్‌రావు మాట్లాడుతూ విద్యార్థులు గ్రంథా యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వక్తలు దినకర్, వనపట్ల సుబ్బ య్య, లైబ్రేరియన్లు పరమేశ్వరి, జిలాని బేగం, భీమ్లానాయక్, భాను, సిబ్బంది తాజొద్దీన్, పవన్, వెంకటేష్ పాల్గొన్నారు.
Updated Date - Nov 20 , 2024 | 11:18 PM