భగీరథ నీళ్లు నేటికీ బిందెడు రాలే
ABN, Publish Date - Aug 20 , 2024 | 01:07 AM
ఇంటింటి కీ శుద్ధి చేసిన రక్షిత తాగునీటిని అందించే మిషన భగీరథ పథకం మండల కేంద్రంలో ప్రారంభమై నేటికి సుమారు నాలుగేళ్లు అవుతుంది.
భగీరథ నీళ్లు నేటికీ బిందెడు రాలే
పథకం ప్రారంభమై నాలుగేళ్లయినా ఇదే పరిస్థితి
సుమారు 250 ఇండ్లకు నేటికి అందని సురక్షిత నీళ్లు
సంబంధిత అధికారులకు చెప్పినా ఫలితం శూన్యం
తిరులమలగిరి మండల కేంద్రం ఎస్సీ కాలనీవాసుల ఆవేదన
తిరుమలగిరి(సాగర్), ఆగస్టు 19: ఇంటింటి కీ శుద్ధి చేసిన రక్షిత తాగునీటిని అందించే మిషన భగీరథ పథకం మండల కేంద్రంలో ప్రారంభమై నేటికి సుమారు నాలుగేళ్లు అవుతుంది. కానీ తిరుమలగిరి (సాగర్) మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో రక్షిత మంచినీరు నేటికీ కనీసం బిందెడు కూ డా రాలేదని కాలనీవాసులు ఆవేదన చెందుతున్నా రు. అధికారులు మా ఇళ్ల ముందు చిన్న పైపులైన వేసి పలు ఇళ్లల్లో నీటి కుళాయిలు కూడా అమర్చకుండా నామమాత్రంగా పనులు చేశారని గ్రామస్థు లు వాపోతున్నారు. ఈ సమస్య గురించి పలుమా ర్లు మిషన భగీరథ ఇంజనీర్లు, స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియజేసినా పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శిస్తున్నారు. దీంతో గత్యంతరం లేక ఎప్పటిలాగా గ్రామ శివారులో ఉన్న బావి నుంచి వచ్చే నీళ్లనే తాగడానికి వినియోగిస్తున్నట్లు వారు తెలుపుతున్నారు. కొందరైతే స్థానికంగా ఉన్న వాట ర్ ప్లాంట్ల వద్ద నీటిని కొనుగోలు చేసి క్యాన్లలో తెచ్చుకుంటున్నారు. మండల కేంద్రంలోనే ఇలా ఉంటే మారుమూల గ్రామాల్లో, తండాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
అసంపూర్తిగా పనులు చేసినట్లు ఆరోపణలు
మిషన భగీరథ పథకంలో భాగంగా ఆయా గ్రామాల్లో ఓహెచఎ్‌సఆర్ ట్యాంకుల నిర్మాణం, నీటి నిల్వ చేసే సామర్థ్యాన్ని బట్టి గ్రామంలో నీటిని పంపిణీ చేసేందుకు మొదట్లో సుమారు 6 ఇంచుల పైపులను చివరికి వచ్చే సరికి సుమారు 2 ఇంచుల వరకు వీధుల్లో అమర్చారు. ఆ పైపులైన్లకే ఇంటింటికీ నీటిని అందించడానికి ఆఫ్ ఇంచు పైపులైన్లతో కనెక్షన్లు ఇవ్వాలి. దీంతో పాటు ఇంటి లోపల భాగంలో నీటిని పట్టుకోవడానికి వీలుగా కుళాయిలను సైతం ఏర్పాటు చేసేందుకు కాంట్రాక్టర్లు పనులను దక్కించుకున్నారు. అయితే స్థానిక ఎస్సీ కాలనీలో వారి ఇంటి ముందు నుంచి వెళ్లే మెయిన పైపులైన నుంచి కనెక్షన మాత్రమే ఇచ్చారని, పలువురి ఇళ్లకు నీటి కుళాయిలను కూడా బిగించకుండా అసంపూర్తిగా పనులు చేశారని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. గ్రామంలో పలుచోట్ల ఇళ్ల ముందు వీదుల్లోనే పైపులైన నుంచి ఇచ్చిన కనెక్షన్లతో బోసిపోతున్న పరిస్థితి ఉంది.
పర్యవేక్షణలో మిషన భగీరథ అధికారుల నిర్లక్ష్యం
గ్రామాల్లో రక్షిత మంచినీటి సరఫరాను సక్రమంగా అందించేందుకు చేపట్టిన పనులను పర్యవేక్షించడంలో సంబంధిత మిషన భగీరథ ఇంజనీర్ల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనపడుతుంది. గ్రామంలో కాంట్రాక్టర్ చేసే పనులను పర్యవేక్షించకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని స్థానికులు విమర్శిస్తున్నారు. ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత ఇంజనీర్లకు తెలియచేసినా వారు పట్టించుకున్న దాఖలాలు లేవని వారు పేర్కొంటున్నారు.
మా ఇళ్లకు భగీరథ నీళ్లు రావట్లేదు
మా కాలనీకి సుమారు నాలుగేళ్లయి నా భగీరథ నీరు రావడం లేదు. దీనిపై అధికారులు తగిన చర్యలు తీసుకోని ఇంటింటికి నీళ్లు వచ్చేలా చూడాలి.
- సైదమ్మ, ఎస్సీ కాలనీ, తిరుమలగిరి, సాగర్
సమస్యను పరిష్కరిస్తాం
స్థానిక కాలనీలో భగీరథ నీళ్లు రావడం లేదని మా దృష్టికి వచ్చింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు నూతనంగా 90 వేల లీటర్ల ఓహెచఎ్‌సఆర్ ట్యాంక్ గ్రామంలో నిర్మిస్తున్నాం. ఆ పనులు పూర్తయిన తర్వాత కాలనీవాసులకు నీటి సరఫరా సక్రమంగా అందేలా చూస్తాం.
- ప్రదీ్‌పరెడ్డి, మిషన భగీరథ, ఏఈఈ
Updated Date - Aug 20 , 2024 | 01:07 AM