ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హైటెక్‌ సిటీలో ‘ఎవర్‌ నార్త్‌’

ABN, Publish Date - Nov 20 , 2024 | 05:22 AM

ఆవిష్కరణలకు ప్రపంచ గమ్యస్థానంగా హైదరాబాద్‌ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఆరోగ్య సంరక్షణ రంగానికి టెక్నాలజీ సొల్యూషన్లు అందించే ప్రముఖ ఆరోగ్య సేవల

గ్లోబల్‌ కేపబిలిటీ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు

మొదటి విడతలో వెయ్యిమందికి ఉద్యోగాలు

హైదరాబాద్‌, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): ఆవిష్కరణలకు ప్రపంచ గమ్యస్థానంగా హైదరాబాద్‌ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఆరోగ్య సంరక్షణ రంగానికి టెక్నాలజీ సొల్యూషన్లు అందించే ప్రముఖ ఆరోగ్య సేవల సంస్థ ఎవర్‌నార్త్‌.. హైదరాబాద్‌ హైటెక్‌ సిటీలోని సాత్వా నాలెడ్జ్‌ పార్కులో ఏర్పాటు చేసిన గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ను (జీసీసీ) మంగళవారం ఆయన ప్రారంభించారు. ఎవర్‌ నార్త్‌ 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యకలాపాలు నిర్వహిస్తుందని, తొలి దశలో వెయ్యిమందికి ఉద్యోగాలు కల్పిస్తుందని, పరోక్షంగా చాలామందికి ఉపాధి దొరుకుతుందని శ్రీధర్‌బాబు తెలిపారు. ఆరోగ్య సేవల రంగంలో ఆవిష్కరణలకు ఇది దోహదపడుతుందని వెల్లడించారు. ఎవర్‌ నార్త్‌ 1.9 కోట్ల మంది భారతీయులకు ఆరోగ్య సేవల సాంకేతికతను అందిస్తోందని, సంస్థకు 30 పైగా దేశాల్లో 75 వేలమంది ఉద్యోగులు, 18.6 కోట్ల వినియోగదారులు ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. కాగా.. ఇంజనీరింగ్‌ విద్యార్థుల్లో ప్రతిభకు పదును పెట్టడమే లక్ష్యంగా తాము ప్రస్తుతం వర్ధమాన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని కంపెనీ డైరెక్టర్‌ (హెచ్‌ఆర్‌) యదుకిశోర్‌ తెలిపారు. ఒక్కో బ్యాచ్‌లో 40 మంది చొప్పున విద్యార్థులకు హెల్త్‌కేర్‌ రంగానికి సంబంధించిన టెక్నాలజీల్లో శిక్షణ ఇచ్చి వారిలో మంచి ప్రతిభ గల వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటామని ఆయన చెప్పారు. మరిన్ని కళాశాలలతో ఇలాంటి భాగస్వామ్యాలు కుదుర్చుకునే యోచన ఉన్నదన్నారు.

నాపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టండి

కాటారం, నవంబరు 19: భూపాలపల్లి జిల్లా కాటారం మండలానికి చెందిన బీజేపీ నాయకుడు చల్లా నారాయణరెడ్డి తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, వాటిపై విచారణ చేపట్టి నిజాలు నిగ్గుతేల్చాని డీజీపీ జితేందర్‌కు మంత్రి శ్రీధర్‌బాబు ఫిర్యాదు చేశారు. మంథని నియోజకవర్గంలోని కొందరు బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయకులు రాజకీయ లబ్ధి కోసం కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. సోషల్‌ మీడియాలో ఏం మాట్లాడినా చెల్లుతుందనే ధోరణి పెరిగిపోయిందని, ఈ నీచ సంస్కృతికి చరమగీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు. మంత్రి మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’తో ఫోన్‌లో మాట్లాడారు. నిష్పక్షపాతంగా సమగ్ర దర్యాప్తు చేయించి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరినట్లు వెల్లడించారు.

Updated Date - Nov 20 , 2024 | 05:22 AM