ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రైతులకు ‘ఫెంగల్‌’ భయం

ABN, Publish Date - Dec 03 , 2024 | 12:48 AM

ఫెంగల్‌ తుపాను ప్రభా వంతో ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. రెండు రోజులుగా చిరు జల్లులు కురవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ధాన్యం రాశులపై పట్టాలు కప్పిన రైతులు

అర్వపలి, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : ఫెంగల్‌ తుపాను ప్రభా వంతో ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. రెండు రోజులుగా చిరు జల్లులు కురవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వాతావారణం ఒక్కసారిగా మారి ఆకాశంలో కారు మబ్బులు కమ్ముకున్నాయి. సూర్యాపేట జిల్లా జాజిరె డ్డిగూడెం మండలంలో 15ఐకేపీ కేంద్రాలు, ఏడు పీఏసీఎస్‌ కేంద్రాలు, రెండు సన్నవడ్ల కేంద్రాలతో మొత్తం 23ధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేశారు. మండలంలోని ఐకేపీ, పీఏసీఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోకి రైతులు ధాన్యాన్ని తరలించారు. కొంతమేర ధాన్యం కాంటాలు అయి లారీల్లో మిల్లులకు ఎగుమతి అయింది. రెండు రోజులుగా ఫెంగల్‌ తుపాన్‌ ప్రభా వంతో చిరుజల్లులు పడుతుండడంతో ఆరబెట్టిన ధాన్యం తడిచిపోతుందోనని ఆందోళనలతో కూలీలను ఏర్పాటు చేసి రైతులు ధాన్యాన్ని గాలి మిషన్లతో తూర్పారా పట్టిస్తున్నారు. వర్షం కారణంగా కూలీలకు డబ్బులు ఎక్కువగా చెల్లించి రైతులు ధాన్యాన్ని శుభ్రం చేయిస్తున్నారు. అర్వపల్లి, కొమ్మాల గ్రామాల్లో మాత్రమే రెండు సన్నవడ్ల కేంద్రాలు ఉన్నాయి. మందకొడిగా సన్న ధాన్యం కాంటాలు అవుతుండడంతో రైతులు చేతికి వచ్చిన పంట ఎక్క డ వర్షాలకు ఆగమవుతుందని ధాన్యం రాశులపై పట్టాలు కప్పుతున్నారు.

Updated Date - Dec 03 , 2024 | 12:48 AM