రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ లక్ష్యం
ABN, Publish Date - Oct 22 , 2024 | 12:47 AM
రైతుల ప్రయోజనాలే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.
చిట్యాలరూరల్, మునుగోడు, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): రైతుల ప్రయోజనాలే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లిలో పీఏసీఎస్ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం, మునుగోడు లో కార్తీకేయన్ పత్తి జిన్నింగ్ మిల్లులో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాలను సోమవారం ఆయ న ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాల్లోనే తమ పంటలనువిక్రయించాలన్నారు. రైతులకిచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన రూ. 2లక్షల రుణమాఫీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన విషయమన్నారు. మునుగోడులో ఏడీఏ వేణుగోపాల్, చండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి కత్తుల రవి, సీసీఐ బయ్యార్ బల్చంద్ర నిం జా, మాజీ ఎంపీపీ పోలగోని సత్యం, కర్నాటి స్వామియాదవ్, మాజీ జడ్పీటీసీ జాజుల అంజయ్య, పిట్టంపల్లిలో వెలిమినేడు పీఏసీఎస్ చైర్మన్ ఏనుగు రఘుమారెడ్డి, వైస్‌చైర్మన్ బొంతల అంజిరెడ్డి, డైరెక్టర్లు పిశాటి భీష్మారెడ్డి, గంగాపురం భాస్కర్‌గౌడ్, గడ్డం సత్తిరెడ్డి, టేకుల కవితాఅంజిరెడ్డి, ము రాల గోపయ్య, మామిడి శ్రీరాములు, మాజీ సర్పంచులు పాల్గొన్నారు.
Updated Date - Oct 22 , 2024 | 12:47 AM