ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తనయుడి చేతిలో తండ్రి హతం

ABN, Publish Date - Nov 30 , 2024 | 12:07 AM

నార్కట్‌పల్లి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): కుటుంబ కలహాల నేపథ్యంలో తనయుడి చేతిలో తండ్రి హత మయ్యాడు.

నార్కట్‌పల్లి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): కుటుంబ కలహాల నేపథ్యంలో తనయుడి చేతిలో తండ్రి హత మయ్యాడు. గురువారం సాయంత్రం నల్లగొండ జిల్లా నార్క ట్‌పల్లి మండలం నెమ్మాని గ్రామంలో ఈ సంఘటన జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం నెమ్మాని గ్రామానికి చెందిన రైతు బక్కతట్ల లింగయ్య(55)కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహంకాగా, కుమారుడు మల్లేశ్‌ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీపట్నంలోని ఓ ప్రైవేటు ల్యాబ్‌ లో పనిచేస్తూ రెండేళ్ల క్రితం అక్కడి యువతిని కులాంతర వివాహం చేసుకుని అక్కడే నివాసం ఉంటున్నాడు. కుమా రుడు కులాంతర వివాహం చేసుకోవడం ఇష్టంలేని లింగయ్య చికాకుతో తరుచూ భార్యను అకారణంగా కొడుతూ వేధిస్తున్నాడు. అంతేకాకుండా ఇటీవల పత్తి విక్రయించగా వచ్చిన డబ్బులను ఎవరికీ ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తున్నాడు. మల్లేశ్‌ భార్య గర్భందాల్చడంతో తల్లిని ఇబ్రహీంపట్నం రమ్మని కోరాడు. ఈ విషయమై మల్లేశ్‌ తల్లిదండ్రుల మధ్య గొడవ జరగడంతో మల్లేశ్‌ తల్లి ఘట్టమ్మ బంధువుల గ్రామం పరడ వెళ్లింది. ఈ క్రమంలో తండ్రిపై ఆగ్రహం పెంచుకున్న మల్లేశ్‌ గురువారం సాయంత్రం పత్తిచేలో ఉన్న లింగయ్య వద్దకు వెళ్లాడు. విద్యుత్‌ వైరుతో మెడకు గుంజి ఊపిరాడకుండా చేసి అక్కడినుంచి ఇంటికి చేరుకున్నాడు. తం డ్రిని కొట్టానని ఇంట్లో సమాచారమివ్వటంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి చూడగా, లింగయ్య విగతజీవిగా కనిపించాడు. నార్కట్‌పల్లి సీఐ నాగ రాజు, ఎస్‌ఐ క్రాంతి కుమార్‌ సంఘటనా స్థలానికి వివరాలు తెలుసుకున్నాడు. నిందితుడు పోలీ సుల అదుపులో ఉన్నట్లు సమాచారం. మృతుడి తండ్రి రాము లు ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Nov 30 , 2024 | 12:07 AM