రేవంత్.. గాలిమాటలు బంద్ చెయ్..
ABN, Publish Date - Apr 21 , 2024 | 03:45 AM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గాలిమాటలు.. పిల్లిశాపాలు బంద్ చేయాలని, రైతులకు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు సూచించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మునిసిపాలిటీ పరిధిలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు
నాపై వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేస్తున్నావ్..
నీవు భూమికి జానెడు ఉన్నావ్ అని అనలేనా?: హరీశ్‌రావు
గజ్వేల్/హైదరాబాద్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గాలిమాటలు.. పిల్లిశాపాలు బంద్ చేయాలని, రైతులకు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు సూచించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మునిసిపాలిటీ పరిధిలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ఎన్నికల సమయంలో నిధులన్నీ సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల, మెదక్‌కు తీసుకుపోతున్నారని ఆరోపించిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు మెదక్‌కు వచ్చి ఏమీ అభివృద్ధి చేయలేదని మాట్లాడటం విడ్డూరమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిసారి తనపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్నారని, దూలంలా పెరిగావ్ అని అంటున్నారని.. భూమికి జానెడు ఉన్నావ్.. ఆవకాయంత మెదడు లేదా అని తాను ఆయనను అనలేనా..? కానీ తనకు సంస్కారం అడ్డు వస్తుందని ఆయన అన్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో పనిచేస్తున్న ఐసీటీ కంప్యూటర్ టీచర్లకు మూడు నెలల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని హరీశ్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీతాల్లేక వారు అప్పుల పాలయ్యి అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయి కానీ ఆచరణ గడప దాటడం లేదని శనివారం ‘ఎక్స్’లో విమర్శించారు.
Updated Date - Apr 21 , 2024 | 03:45 AM