ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AI: డిగ్రీ, పీజీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కాలేజ్‌లో ఉండగానే ఫ్రీ ట్రైనింగ్

ABN, Publish Date - Sep 05 , 2024 | 09:06 AM

డిగ్రీ, పీజీ విద్యార్థులకు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో(Artificial Intelligence) విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇప్పించాలని నిర్ణయించింది.

హైదరాబాద్: డిగ్రీ, పీజీ విద్యార్థులకు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో(Artificial Intelligence) విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇప్పించాలని నిర్ణయించింది. ఒక్క ఏడాదిలో కనీసం లక్ష మందికి శిక్షణ ఇప్పించేలా ప్రణాళికలు రూపొందించింది. అయితే శిక్షణను నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించకుండా.. 'నెక్స్ట్ వేవ్'(Nxt Wave) అనే స్టార్టప్ కంపెనీతో జరపనుంది. ఈ మేరకు గురువారం అంతర్జాతీయ ఏఐ సదస్సులో ఒప్పందం కుదుర్చుకోనుంది. నెక్స్ట్ వేవ్ 9 రాష్ట్రాల్లో విద్యార్థులకు శిక్షణనిస్తోంది.

ఇది 2 వేల కంపెనీలతో కలిసి పనిచేస్తోంది. ఇప్పటివరకు ఏపీ, తెలంగాణల్లో 1.5 లక్షల మందికి సహా మొత్తం 5 లక్షల మందికిపైగా విద్యార్థులకు ఏఐలో శిక్షణ ఇచ్చింది. "సుమారు నెల, రెండు నెలలపాటు శిక్షణ ఉంటుంది. ఇది వర్క్ షాప్‌లాగా నిరంతరం కొనసాగుతుంటుంది. ఏడాదిలో 30 లక్షల మందికి శిక్షణ ఇవ్వాలనేది మా లక్ష్యం" అని నెక్స్ట్ వేవ్ ఫౌండర్, సీఈవో రాహుల్ అట్లూరి చెప్పారు. దీంతో సాంకేతిక అంశాలపై పట్టు ఉండని విద్యార్థులకు కూడా ఏఐపై పట్టు పెరిగే అవకాశం కల్పించినట్లవుతుంది.


ఏఐతోపాటు..

ఏఐతోపాటు, మెషిన్ లెర్నింగ్, ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ వంటి 4.0 సాంకేతికతలపై శిక్షణ ఇచ్చేందుకు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్ఓసీ)తో హైదరాబాద్‌కు చెందిన నెక్ట్వైవ్ ప్రత్యేక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

స్కిల్ అప్ ఇండియా 4.0 పేరుతో దేశ వ్యాప్తంగా 30 లక్షల మంది విద్యార్థులకు ఈ కొత్త నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వనుంది. ఐటీతోపాలు వివిధ పరిశ్రమలకు అవసరమైన విధంగా విద్యార్థులను సిద్ధం చేసేందుకు ఇది తోడ్పడుతుందని రాహుల్ పేర్కొన్నారు.

For Latest News click here

Updated Date - Sep 05 , 2024 | 09:11 AM

Advertising
Advertising