సరదా.. సరదాగా..
ABN, Publish Date - Sep 16 , 2024 | 12:00 AM
వీకేండ్‌తో పాటు వరుస సెలవులు రావడంతో పర్యాటక ప్రాంతాలు సందర్శకులతో పోటెత్తాయి.
ధారూరు, సెప్టెంబరు 15 : వీకేండ్‌తో పాటు వరుస సెలవులు రావడంతో పర్యాటక ప్రాంతాలు సందర్శకులతో పోటెత్తాయి. ధారూరు మండల పరిధిలోని కోట్‌పల్లి ప్రాజెక్టుకు సందర్శకులు త రద్దీ పెరిగింది. ఆదివారం సందర్శకులు పారుతున్న అలుగులో జలకాలాడారు. వివిధ ప్రాంతాల నుంచి కుటుంబసభ్యులతో, స్నేహితులతో ప్రాజెక్టు వద్దకు వచ్చిన సందర్శకులు అలుగు నీటిలో ఫొటోలు, సెల్పీలు దిగుతూ ఎంజాయి చేశారు. కొంతమంది ప్రాజెక్టు నీటిలో బోటింగ్ చేస్తూ సరదాగా గడిపారు.
Updated Date - Sep 16 , 2024 | 12:00 AM