ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gadwal : తెరుచుకున్న ఆల్మట్టి గేట్లు

ABN, Publish Date - Jul 17 , 2024 | 05:27 AM

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయానికి వరద పోటెత్తుతోంది. మంగళవారం సాయంత్రానికి ప్రాజెక్టుకు 1,04,000 క్యూసెక్కల వరద వచ్చి చేరుతోంది.

  • ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో

  • 65 వేల క్యూసెక్కుల నీరు విడుదల

హైదరాబాద్‌/గద్వాల, జూలై 16 (ఆంధ్రజ్యోతి): ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయానికి వరద పోటెత్తుతోంది. మంగళవారం సాయంత్రానికి ప్రాజెక్టుకు 1,04,000 క్యూసెక్కల వరద వచ్చి చేరుతోంది. ఆల్మట్టి సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా, ప్రస్తుతం జలాశయంలో 99.24 టీఎంసీల నీరు ఉంది. పై నుంచి వరద భారీగా వస్తుండటంతో జల విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 40 వేల క్యూసెక్కులు, 14 గేట్లను ఎత్తి మరో 25 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

నారాయణపూర్‌ జలాశయం సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా ప్రాజెక్టులో 28.76 టీఎంసీల నీరు ఉంది. ఇన్‌ఫ్లో 65 వేల క్యూసెక్కులు ఉండటంతో ఒక్క రోజులోనే ఈ ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. ఇప్పటికే జూరాల జలాశయం నిండి ఉండటంతో శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు పెట్టే అవకాశం ఉంది. మరోవైపు, శ్రీశైలం జలాశయానికి 2,496 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టులో జలవిద్యుత్‌ ఉత్పాదన ద్వారా 32,262 క్యూసెక్కులను నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు.

తుంగభద్ర పూర్తిస్థాయి నీటిమట్టం 105.79 టీఎంసీలు కాగా ప్రస్తుతం 35.47 టీఎంసీలకు చేరుకున్నది. మంగళవారం ప్రాజెక్టుకు 28,153 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ఈ నెల 15న జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో నిర్ణయాలకు అనుగుణంగా సాగర్‌ నుంచి తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేయడానికి వీలుగా కృష్ణా బోర్డు మంగళవారం ఆదేశాలు ఇచ్చింది. 4.5 టీఎంసీలను సాగర్‌ కుడి కాలువ నుంచి ఏపీకి, 5.4 టీఎంసీలను తెలంగాణకు విడుదల చేయాలని బోర్డు ఆదేశించింది. బుధవారం నుంచి 5,500 క్యూసెక్కులను సాగర్‌ కుడి కాలువ నుంచి ఏపీకి విడుదల చేయాలని బోర్డు నిర్దేశించింది.

Updated Date - Jul 17 , 2024 | 10:39 AM

Advertising
Advertising
<