గంగమ్మ ఒడికి గణనాథులు
ABN, Publish Date - Sep 16 , 2024 | 12:02 AM
తొమ్మిదిరోజుల పాటు విశేష పూజలందుకున్న గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకున్నారు. వినాయకచవితి నవరాత్రుల సందర్భంగా ఆదివారం ఘట్‌కేసర్ మున్సిపల్, ఎదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువుకట్టపై నిమజ్జనాలు ఆర్ధరాత్రి వరకూ కొనసాగాయి.
కనుల పండువగా శోభాయాత్రలు, అన్నదానాలు
ఘట్‌కేసర్‌రూరల్, సెప్టెంబరు 15: తొమ్మిదిరోజుల పాటు విశేష పూజలందుకున్న గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకున్నారు. వినాయకచవితి నవరాత్రుల సందర్భంగా ఆదివారం ఘట్‌కేసర్ మున్సిపల్, ఎదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువుకట్టపై నిమజ్జనాలు ఆర్ధరాత్రి వరకూ కొనసాగాయి. చెరువుకట్టపై రెండు భారీ క్రేన్లు ఏర్పాటు చేయగా, చిన్న వినాయకులను బతుకమ్మ ఘాట్ వద్ద, పెద్ద వినాయకులను వినాయక్ ఘాట్ వద్ద నిమజ్జనం చేశారు.సీఐ సైదులు ఆధ్వర్యంలో 113 మంది పోలీసు సిబ్బందితో బందో బస్తు నిర్వహించారు ఘట్‌కేసర్ మున్సిపల్, ఎదులాబాద్ మెగా ఇంజనీరింగు కళాశాలలో వినాయక నిమజ్జనం కనుల పండువగా జరిగింది. కళాశాలలో ఉట్లు కొట్టె కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వినాయక ఊరేగింపులో విద్యార్థుల నృత్యాలు అలరించారు. పలు వినాయక మండపాల వద్ద అన్నధాన కార్యక్రమాలు నిర్వహించారు.
Updated Date - Sep 16 , 2024 | 12:02 AM