Jubilee hills : లోటస్ పాండ్‌లో నిర్మాణాలపై కమిషనర్ రంగనాథ్ సీరియస్
ABN, Publish Date - Jun 27 , 2024 | 04:27 PM
జూబ్లీహిల్స్ లోటస్ పాండ్‌లోని బఫర్ జోన్‌లో నిర్మాణాలపై జీహెచ్ఎంసీ ఈవీడీఎం ( ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్) కమిషనర్ ఎ.వి. రంగనాథ్ మండిపడ్డారు. గురువారం లోటస్ పాండ్ పరిసర ప్రాంతాల్లోని నిర్మాణాలను ఆయన పరిశీలించారు.
హైదరాబాద్, జూన్ 27: జూబ్లీహిల్స్ లోటస్ పాండ్‌లోని బఫర్ జోన్‌లో నిర్మాణాలపై జీహెచ్ఎంసీ ఈవీడీఎం ( ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్) కమిషనర్ ఎ.వి. రంగనాథ్ మండిపడ్డారు. గురువారం లోటస్ పాండ్ పరిసర ప్రాంతాల్లోని నిర్మాణాలను ఆయన పరిశీలించారు. చెరువుల అక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవంటూ భవన నిర్మాణ దారులను ఆయన హెచ్చరించారు. అయితే లోటస్ పాండ్ రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌ను తొలగించి నిర్మాణ పనులు చేపట్టడంపై ఆయన మండిపడ్డారు.
అందుకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించి వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఎ.వి.రంగనాథ్ ఆదేశించారు. చట్టానికి వ్యతిరేకంగా పని చేసే ఉద్యోగులపై కొరడా ఝుళిపిస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈవీడీఎం కమిషనర్‌గా ఎ.వి.రంగనాథ్ తాజాగా బాధ్యతలు చేపట్టారు. ఆ మరుసటి రోజు నుంచి జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై ఆయన ఉక్కుపాదం మోపారు. మరోవైపు ఇదే లోటస్ పాండ్‌లోని వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్ నివాసంలో నిర్మించిన అక్రమ పార్కింగ్ స్థలాన్ని ఇటీవల జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేసిన విషయం విధితమే.
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jun 27 , 2024 | 04:36 PM