ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మేకను కాపాడబోయి..

ABN, Publish Date - Mar 27 , 2024 | 11:35 PM

మేకను కాపాడ బోయి చేపల చెరువులో పడి యవకుడు మృతిచెందాడు.

చేపల చెరువులో పడి యువకుడు మృతి

యాదగిరిగుట్ట రూరల్‌, మార్చి 27: మేకను కాపాడ బోయి చేపల చెరువులో పడి యవకుడు మృతిచెందాడు. ఈ సంఘటన యాదాద్రిభువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని మల్లాపురం గ్రామంలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కర్రె నర్సింహులు, పారిజాత దంపతుల పెద్ద కుమారుడు నవీన్‌(27) తన వ్యవసాయ బావి సమీపంలో హైదరాబాద్‌కు చెందిన రఫీ అనే వ్యక్తికి చెందిన చేపల చెరువు ఉంది. తన మేక చెరువులోకి వెళ్లిందని దానిని తీసుకరావడానికి నవీన్‌ చెరువులోకి దిగాడు. చెరువు లోతుగా ఉండడంతో ఈతరాని చెరువులో మునిగి ఊపికాడక అందులోనే మృతిచెందాడు. వ్యవసాయ బావివద్దనే ఉన్న తల్లిదండ్రులు గమనించి తమ కుమారుడు ఇప్పటి వరకు రాలేదని చెరువు వద్దకు వెళ్లి చూసేసరికి చెరువులో నుంచి మేక బయటకు వచ్చింది. నవీన్‌ చెరువులోనే పడిపోయాడని వారు కేకలు వేయడంతో అక్క డున్న వారు వచ్చి చెరువులో గాలించినా అతని జాడ దొరకలేదు. వెంటనే జేసీబీ ద్వారా చెరువుకట్టకు గండిపెట్టారు. దీంతో చెరువులోని నీరు బయటకు వెళ్లిపోవడం తో చెరువులో నవీన్‌ మృతదేహం లభించింది. మృతదే హాన్ని బయటకు తీసి దహనసంస్కారాలు నిర్వహించారు. ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య బాధిత కుటుంబాన్ని ఓదార్చారు.

Updated Date - Mar 27 , 2024 | 11:35 PM

Advertising
Advertising