పేదలకు అండగా ప్రభుత్వం : ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి
ABN, Publish Date - Oct 20 , 2024 | 12:33 AM
పేదలకు ప్రభుత్వం అం డగా ఉంటుందని ఎ మ్మెల్యే జైవీర్‌రెడ్డి అ న్నారు.
పేదలకు అండగా ప్రభుత్వం : ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి
త్రిపురారం, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): పేదలకు ప్రభుత్వం అం డగా ఉంటుందని ఎ మ్మెల్యే జైవీర్‌రెడ్డి అ న్నారు. మండల కేం ద్రంలోని రైతు వేదిక లో శనివారం ఎమ్మె ల్యే జైవీర్‌రెడ్డి కల్యాణలక్ష్మి, షాదీముబార క్, సీఎం సహాయని ధి చెక్కులను పంపి ణీ చేశారు. మండలానికి చెందిన 11 క ల్యాణలక్ష్మి చెక్కులు, 30 మందికి మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ కాంగ్రెస్ పేదల ప్రభుత్వమని అన్నా రు. పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్రంలో ప్రజా ప్ర భుత్వం ఏర్పడిందని గుర్తు చేశారు. ప్రైవేట్ ఆ స్పత్రిలో చికిత్స పొంది డబ్బులు ఖర్చు చేసుకు న్న వారిని ఆదుకోవడం కోసం సీఎం సహాయనిధితో ఊరట కలుగుతుందన్నారు. కార్యక్రమం లో నాయకులు బుచ్చిరెడ్డి, అనుముల నర్సిరెడ్డి, వెంకట్‌రెడ్డి, అంకతి సత్యం, బుసిరెడ్డి శ్రీనివా్‌సరె డ్డి, భాస్కర్‌నాయక్, అమరేందర్‌రెడ్డి, రవికుమా ర్, శ్రీను, బాలు, సోమయ్య, ప్రమీల పాల్గొన్నారు.
Updated Date - Oct 20 , 2024 | 12:33 AM