రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
ABN, Publish Date - Oct 22 , 2024 | 12:58 AM
రైతు ల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే నేనావత బాలునాయక్ అన్నారు.
రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్
దేవరకొండ, నేరేడుగొమ్ము, చింతపల్లి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): రైతు ల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే నేనావత బాలునాయక్ అన్నారు. సోమవారం నియోకవర్గంలోని దేవరకొండ, నేరేడుగొమ్ము, చింతపల్లి మండలాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులకు అందుబాటులో ఉండి సే వలు అందించాలని కోరారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల ను ప్రజలు, రైతులకు వివరించాలని అన్నారు. రైతులు పండించిన వరిధా న్యం కొనుగోలులో గత ప్రభుత్వం మోసం చేసిందన్నారు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కొ నుగోలు కేంద్రాలలోనే మద్దతు ధర లభిస్తుందని అన్నారు. రైతులు ధాన్యం కల్లాల వద్దనే ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని అన్నారు. రైతుల శ్రేయస్సు కోసం రూ.2లక్షల రుణమాఫీ చేయ డం జరిగిందన్నారు. వచ్చే యాసంగి సీజన నుంచి రైతుభరోసా పథకం ద్వా రా రూ.7500 రైతులకు అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
దేవరకొండ నూతన పాలకమండలి మార్కెట్ కమిటీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన నాయిని జము న మాధవరెడ్డి, మునిసిపల్ చైర్మన ఆలంపల్లి నర్సింహ, పీఏసీఎస్ చైర్మన జాల నర్సింహారెడ్డి, మార్కెట్ కార్యదర్శి కిరణ్‌కుమార్, ఏడీఏ శ్రీలక్ష్మి, మా ర్కెట్ కమిటీ డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.
నేరేడుగొమ్ము మండలం పేర్వాల గ్రామ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బాలునాయక్ ప్రారంభించారు. ధాన్యం కొనుగోలులో మోసాలకు పాల్పడితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమం లో పార్టీ కాంగ్రెస్ నాయకుడు సిరాజ్‌ఖాన, పీఏసీఎస్ చైర్మన్లు కొండ్రం శ్రీశై లంయాదవ్, జాల నర్సింహారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కృష్ణ, పాపనాయ క్, వెంకటయ్య, రమేష్, బిక్కునాయక్, తహసీల్దార్ శ్రీరాములు పాల్గొన్నారు.
చింతపల్లి మండల పరిధిలోని కుర్మేడ్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రా న్ని ఆయన ప్రారంభించారు. రైతుల శ్రేయస్సు కోసం రూ.2 లక్షల రుణమా ఫీ చేసినట్లు తెలిపారు. వచ్చే వేసవికాలం సీజన నుంచి రైతు భరోసా ప థకం ద్వారా రూ.7500 రైతులకు అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, కాంగ్రెస్ పార్టీ మండల అఽధ్యక్షుడు అంగిరేకుల నాగభూషణ్, మాల్ మార్కెట్ కమిటీ చైర్మన దొం తం అలివేలు సంజీవరెడ్డి, మాజీ ఎంపీపీ కొండూరి భవాని పవనకుమార్, హరినాయక్, కాయతి జితేందర్‌రెడ్డి, జిల్లా అధికారప్రతినిధి ముచ్చర్ల యా దగిరి, నాయకులు వెంకటయ్యగౌడ్, శ్రీనివాస్, వెంకటయ్య, ఏడీ శ్రీలక్ష్మీ, ఏవో శ్రావణకుమారి, సీఈవో మల్లేష్ తహసీల్దార్ రమాకాంతశర్మ, ఎంపీడీవో సుజాత, ఏఈవో నరసింహ, సంగమేశ్వర్ పాల్గొన్నారు.
Updated Date - Oct 22 , 2024 | 12:58 AM