Green signal : ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు గ్రీన్ సిగ్నల్
ABN, Publish Date - Dec 04 , 2024 | 06:17 AM
ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు రంగం సిద్ధమైంది. పరస్పర బదిలీల కోసం అర్జీలు పెట్టుకున్న ఉపాధ్యాయుల దరఖాస్తులను పరిశీలించి, వారి నుంచి వ్యక్తిగత పూచీ తీసుకొని, తదుపరి బదిలీ ఉత్తర్వులు
జీవో 317 దరఖాస్తుల పరిశీలనకు సర్కారు ఆదేశం
హైదరాబాద్, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు రంగం సిద్ధమైంది. పరస్పర బదిలీల కోసం అర్జీలు పెట్టుకున్న ఉపాధ్యాయుల దరఖాస్తులను పరిశీలించి, వారి నుంచి వ్యక్తిగత పూచీ తీసుకొని, తదుపరి బదిలీ ఉత్తర్వులు విడుదల చేయడానికి అనుగుణంగా వివరాలు పంపించాలని పాఠశాల విద్య డైరెక్టర్ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. దీనిప్రకారం పరస్పర బదిలీలకు అంగీకారం తెలుపుతున్నట్లు ఇద్దరు ఉపాధ్యాయులు తమ పేరు, ఐడీ నంబరు, మొబైల్ నంబరు, హెచ్‌వోడీ వివరాలతో పాటు ప్రస్తుత స్థానిక క్యాడర్, దరఖాస్తు(వెళ్లాలనుకున్న) కొత్త క్యాడర్ వివరాలు పొందుపరిచి, ఇద్దరు ఒకే పత్రంపై సంతకాలు చేసి, అండర్‌టేకింగ్ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. జిల్లా విద్యా శాఖాధికారులు ఆయా ఉపాధ్యాయుల దరఖాస్తులను పరిశీలించి, సమగ్ర వివరాలను ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది.
Updated Date - Dec 04 , 2024 | 06:17 AM