ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

గ్రూపు-1 దరఖాస్తులు భారీగా తగ్గాయ్‌

ABN, Publish Date - Mar 14 , 2024 | 05:37 AM

గ్రూపు-1 పోస్టులకు పోటీ పడే అభ్యర్థుల సంఖ్య భారీగా తగ్గింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం లక్ష మంది అభ్యర్థులు తగ్గారు.

2.7 లక్షల మంది దరఖాస్తు

గతంతో పోలిస్తే లక్ష తగ్గుదల

నేటితో ముగియనున్న గడువు

హైదరాబాద్‌, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): గ్రూపు-1 పోస్టులకు పోటీ పడే అభ్యర్థుల సంఖ్య భారీగా తగ్గింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం లక్ష మంది అభ్యర్థులు తగ్గారు. గ్రూపు-1 పోస్టుల భర్తీ కోసం గతంలో జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి, తిరిగి కొత్త నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. గతంలో నోటిఫికేషన్‌కు సుమారు 3.8 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. దాంతో పోలిస్తే ప్రస్తుతం లక్షకు పైగా దరఖాస్తులు తగ్గాయి. గ్రూపు-1 ప్రిలిమినరీ పరీక్షను జూన్‌ 9న, మెయిన్స్‌ను అక్టోబరు 21 నుంచి నిర్వహించనున్నారు.

18 నుంచి ఏఈఈ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌

అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీలో భాగంగా అభ్యర్థులకు ఈ నెల 18 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియను 22 వరకు జేఎన్‌టీయూ అడ్మిషన్‌ బ్లాకులో నిర్వహిస్తామని టీఎ్‌సపీఎస్సీ అధికారులు తెలిపారు. కాగా, ఇంటర్‌ పరీక్షలు గురువారం ముగియనున్నాయి. గురువారం కెమిస్ట్రీ పేపర్‌-2, కామర్స్‌ పేపర్‌-2 పరీక్షలు జరగనున్నాయి. తర్వాత బ్రిడ్జి కోర్సుల పరీక్షలుంటాయి. అవి ఈ నెల 18తో పూర్తవుతాయి.

Updated Date - Mar 14 , 2024 | 07:28 AM

Advertising
Advertising