ఏప్రిల్ 28న గురుకుల కాలేజీల ప్రవేశ పరీక్ష
ABN, Publish Date - Mar 28 , 2024 | 05:11 AM
రాష్ట్రంలోని బీసీ గురుకులాల పరిఽధిలో ఉన్న 255 జూనియర్ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు ఏప్రిల్ 28న పరీక్ష నిర్వహించనున్నట్టు సెక్రటరీ సైదులు తెలిపారు. ఈ
హైదరాబాద్, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని బీసీ గురుకులాల పరిఽధిలో ఉన్న 255 జూనియర్ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు ఏప్రిల్ 28న పరీక్ష నిర్వహించనున్నట్టు సెక్రటరీ సైదులు తెలిపారు. ఈ పరీక్షకు ఏప్రిల్ 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం బీసీ గురుకులాల పరిధిలో ఉన్న 6 సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కళాశాలలు మినహా మిగిలిన 255 కళాశాలల్లో ఉన్న 21,920 సీట్లకు ప్రవేశాలను ఇవ్వనున్నట్టు తెలిపారు. 130 బాలుర కళాశాలల్లో 11,360 సీట్లు, 125 బాలికల కళాశాలల్లో 10,560 సీట్లు ఉండగా... వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వివరాలకు బీసీ గురుకుల వెబ్‌సైట్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.
Updated Date - Mar 28 , 2024 | 09:59 AM