ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Harish Rao: అబద్ధాలే ఆశ్చర్యపోయేలా

ABN, Publish Date - Oct 19 , 2024 | 04:24 AM

అబద్ధాలే ఆశ్చర్యపోయేలా సీఎం రేవంత్‌రెడ్డి మాటలు ఉన్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. తన రియల్‌ ఎస్టేట్‌ కలల్ని గ్రాఫిక్స్‌లో సీఎం చూపించారని విమర్శించారు.

  • మూసీ రివర్‌ ఫ్రంట్‌లో దాగి ఉన్న స్టంట్‌ ఏంటి?

  • పునరుజ్జీవం పేరిట రియల్‌ దందా.. ఒప్పుకోం

  • 10 వేల కుటుంబాలకు మేలు జరుగుతుందంటే

  • మూసీ వద్ద 4 నెలలైనా ఉంటా: హరీశ్‌రావు

హైదరాబాద్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): అబద్ధాలే ఆశ్చర్యపోయేలా సీఎం రేవంత్‌రెడ్డి మాటలు ఉన్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. తన రియల్‌ ఎస్టేట్‌ కలల్ని గ్రాఫిక్స్‌లో సీఎం చూపించారని విమర్శించారు. రివర్‌ ఫ్రంట్‌ వెనుక దాగి ఉన్న స్టంట్‌ ఏమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ హయాంలోనే మూసీ సుందరీకరణ ప్రారంభమైందన్నారు. ఇప్పుడు మూసీ పునరుజ్జీవనం పేరిట సీఎం రేవంత్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. శత్రు దేశాలపై దాడి చేసినట్లు పేదల బస్తీలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.


లక్షన్నర కోట్లతో మూసీ ప్రాజెక్టు చేపడతామని చెప్పిన రేవంత్‌.. ఇప్పుడు మాట మార్చి ఎవరు చెప్పారని దబాయిస్తున్నారని ఆరోపించారు. ‘‘తొలుత మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజల సమస్యలు తెలుసుకుందాం. ఆ తర్వాత మల్లన్న సాగర్‌, రంగనాయక సాగర్‌ నిర్వాసిత గ్రామాలకు వెళ్లి మా హయాంలో కల్పించిన సౌకర్యాలపై ఆరా తీద్దాం. ఇందుకు సిద్ధమేనా?’’ అని రేవంత్‌కు సవాల్‌ విసిరారు. మూసీ నిర్వాసితులకు గచ్చిబౌలిలో 450 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఇళ్లను నిర్మించి ఇస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. నల్లగొండ ప్రజలపై ప్రేమ ఉంటే మూసీలోకి మురుగు నీరు, పారిశ్రామిక వ్యర్ధాలు వెళ్లకుండా చర్యలు చేపట్టాలన్నారు.


బెంగళూరు, చెన్నై వరదల్ని చూపించి ఇక్కడ ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేయడం సరి కాదన్నారు. సుందరీకరణ పేరుతో వేల కోట్లు కొల్లగొట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. మూసీ బఫర్‌ జోన్‌లో మీడియా ప్రముఖుల ఇళ్లు కూడా ఉన్నాయని వెల్లడించారు. 10 వేల మందికి మేలు జరుగుతుందంటే మూడు నెలలు కాదు.. నాలుగు నెలలైనా మూసీ వద్ద ఉంటానని స్పష్టం చేశారు. ‘‘ఎమ్మెల్యేగా గెలవకముందే నాకు మంత్రి పదవి ఇచ్చారని సీఎం రేవంత్‌ రెడ్డి అంటున్నారు. ఆ టైంలో నువ్వు బీఆర్‌ఎ్‌సలో నా శిష్యుగా ఉన్నావు. నేను మంత్రి అయినప్పుడు నాతోపాటు డ్యాన్స్‌ చేశావు. నేను మంత్రి పదవికి రాజీనామా చెసినప్పుడు గన్‌ పార్కు దగ్గర నా వెనక నిలబడ్డావు. టీవీలో కనిపించేందుకు నిక్కినిక్కి చూశావు. బీఆర్‌ఎస్‌ పొత్తుతోనే మొదటి సారి ఎమ్మెల్యే అయ్యావు. సోనియా గాంధీని బలిదేవత అన్న నోటితోనే కాంగ్రెస్‌ గురించి ఎలా మాట్లాడుతున్నావు? కొంచెమైనా నైతికత ఉందా?’’ అని ప్రశ్నించారు.

Updated Date - Oct 19 , 2024 | 04:24 AM