Harish Rao: 9 నెలల్లో విద్యా వ్యవస్థ పతనం

ABN, Publish Date - Sep 17 , 2024 | 03:46 AM

రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ అగ్ర నాయకుడు తన్నీరు హరీ్‌షరావు సోమవారం బహిరంగ లేఖ రాశారు. వాటిని తక్షణమే పరిష్కరించాలని కోరారు. ‘‘మీ 9నెలల పాలనలో విద్యావ్యవస్థ పతనానికి చేరుకొంది. సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి దుర్భరంగా మారింది.

Harish Rao: 9 నెలల్లో విద్యా వ్యవస్థ పతనం

  • సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి దుర్భరం

  • సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్‌ రావు లేఖ

హైదరాబాద్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ అగ్ర నాయకుడు తన్నీరు హరీ్‌షరావు సోమవారం బహిరంగ లేఖ రాశారు. వాటిని తక్షణమే పరిష్కరించాలని కోరారు. ‘‘మీ 9నెలల పాలనలో విద్యావ్యవస్థ పతనానికి చేరుకొంది. సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి దుర్భరంగా మారింది. కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండు చేస్తూ విద్యార్థులు రోడ్డెక్కి నిరసన తెలపాల్సి వస్తోంది. ఈ విద్యాసంవత్సరంలో ఇప్పటివరకు 715 మందికిపైగా విద్యార్థులు ఆస్పత్రుల పాలు కాగా, 40పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. టీచర్లు లేక కొన్నిచోట్ల బడులు మూతబడితే.. మరోవైపు ప్రభుత్వ బడులమీద విశ్వాసం సన్నగిల్లి డ్రాపౌట్స్‌ సంఖ్య పెరుగుతోంది.


ఒక్క విద్యార్థి కూడా లేని పాఠశాలలు 1864 ఉంటే, 30మంది లోపు విద్యార్థులున్న పాఠశాలలు 9,447ఉన్నాయి. మీ ప్రభుత్వ లెక్కలే ఈ వాస్తవాలు చెబుతున్నాయి. ఈ విద్యాసంవత్సరంలో మూతబడిన 1900 పాఠశాలలను తిరిగి ప్రారంభించాలి. ఎనిమిది నెలలుగా పెండింగ్‌లో ఉన్న సంక్షేమ హాస్టళ్ల అవుట్‌ సోర్సింగ్‌ టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగుల జీతాలు వెంటనే ఇవ్వాలి. పది నెలలుగా పెండింగ్‌లో ఉన్న వసతి గృహాల అద్దెలు చెల్లించాలి. ఈ ఏడాది ఏప్రిల్‌ నుండి సెప్టెంబర్‌ వరకు గురుకుల పాఠశాల విద్యార్థులకు రావాల్సిన రూ. 62 (కాస్మోటిక్‌ రూ.50, హెయిర్‌ కటింగ్‌ రూ.12) ఇప్పటి వరకు అందలేదు. కాలేజీ హాస్టళ్లలోని విద్యార్థులకు ప్రతినెల అందాల్సిన రూ.500 పాకెట్‌మనీ ఇవ్వలేదు. ఎస్సీ గురుకుల విద్యార్థులకు నాలుగు జతల స్కూల్‌ యూనిఫామ్‌లు అందలేదు. వసతి గృహాల నిర్వహణకు ప్రతినెలా ఇచ్చే రూ.10వేలు వెంటనే విడుదల చేయాలి’’ అని హరీ్‌షరావు కోరారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న మరికొన్ని సమస్యలను ఆయన ఈ లేఖలో ప్రస్తావించారు.

Updated Date - Sep 17 , 2024 | 03:46 AM

Advertising
Advertising