ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

History of Balapur Laddu: బాలాపూర్ లడ్డూ చరిత్ర ఇదే..

ABN, Publish Date - Sep 17 , 2024 | 11:34 AM

వినాయక చవితి వచ్చిందంటే చాలు.. ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ లడ్డూలపైన అందరి దృష్టి ఉంటుంది. నవరాత్రులు ముగిశాయి. ఖైరతాబాద్‌లోని మహా గణపతి శోభయాత్ర ప్రారంభమైంది. ఇక బాలాపూర్‌ లడ్డూ సైతం వేలం పాటలో రికార్డు స్థాయిలో ధర పలికింది.

వినాయక చవితి వచ్చిందంటే చాలు.. ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ లడ్డూలపైన అందరి దృష్టి ఉంటుంది. నవరాత్రులు ముగిశాయి. ఖైరతాబాద్‌లోని మహా గణపతి శోభయాత్ర ప్రారంభమైంది. ఇక బాలాపూర్‌ లడ్డూ సైతం వేలం పాటలో రికార్డు స్థాయిలో ధర పలికింది. ఈ ఏడాది రూ.30,01,000 ధర పలికింది. కొలను శంకర్ రెడ్డి ఈ బాలాపూర్ లడ్డూను వేలం పాట ద్వారా కొనుగోలు చేశారు. గతేడాది ఇదే బాలాపూర్ లడ్డూ రూ. 27 లక్షల ధర పలికింది. నాడు ఈ లడ్డును దాసరి దయానంద్ రెడ్డి వేలంపాటలో గెలుచుకున్నారు. ఈయన స్థానికేతరుడు కావడం గమనార్హం.

Also Read: New York: స్వామినారాయణ్ ఆలయంపై దాడి: ఖండించిన భారత్


ఇంతకీ బాలాపూర్ ఎక్కఉ ఉంది..?

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం సమీపంలో బాలాపూర్ గ్రామం ఉంది.

బాలాపూర్ లడ్డు విశిష్టత..

దశాబ్దాలుగా బాలాపూర్‌లో గణేశ్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 1980లో బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటైంది.

Also Read: Kolkata: మాజీ ప్రిన్సిపాల్ ప్రొ. ఘోష్ ఫామ్ హౌస్‌లో ఈడీ సోదాలు


బాలాపూర్ లడ్డూ వేలం పాట ఎప్పుడు ప్రారంభమైందంటే..

1994లో తొలిసారి బాలాపూర్ లడ్డును వేలం వేశారు. ఈ లడ్డూను స్థానికుడు, వ్యవసాయదారు కొలను మోహన్ రెడ్డి కుటుంబం రూ. 450కి దక్కించుకుంది. ఈ లడ్డును గ్రామస్తులను ప్రసాదంగా పంచి... మిగిలిన ప్రసాదాన్ని పొలంలో చల్లాడు. ఆ ఏడాది ఆయన ఆర్థికంగా నిలదొక్కుకున్నాడు. ఈ విషయాన్ని కొలను మోహన్ రెడ్డి కుటుంబం గమనించింది.

ఆ తర్వాత ఏడాది.. అంటే 1995లో నిర్వహించిన వేలం పాటలో బాలాపూర్ లడ్డును రూ. 4500కు దక్కించుకున్నాడు. అనంతరం ఆయన కుటుంబం ఆర్థికంగా బాగా ఎదిగింది. దీంతో బాలాపూర్ లడ్డూకు చాలా మహిమ ఉందని భక్తుల్లో నమ్మకం ఏర్పడింది. అలా ప్రతి ఏడాది వందల నుండి వేలకు, వేలు నుండి లక్షలకు ఈ బాలాపూర్ లడ్డూ వేలం పాట చేరుకుంది.

Also Read: Gold and Silver Rates Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. భారీగా పెరిగిన వెండి రేటు


వేల నుంచి లక్షల్లోకి వెళ్లిన లడ్డూ ధర

2002లో ఈ బాలాపూర్ లడ్డూ వేలం పాటలో రూ. 1,05000 పలికింది. దీంతో వేలం పాటలో వేలల్లో ఉన్న ఈ లడ్డూ ధర లక్షకు వెళ్లింది. నాటి నుంచి ప్రతీ ఏడాది జరిగే వేలం పాటలో బాలాపూర్ లడ్డూ రికార్డు స్థాయిలో ధర పలుకుతుంది.

Also Read: టెలిఫోన్ భవన్ చేరుకున్న బడా గణపతి |


ఈ వేలం పాటలో పాల్గొనాలంటే..

గణపతి నవరాత్రుల ప్రారంభం రోజు.. బాలాపూర్ లడ్డూ వేలం పాటలో పాల్గొనే వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ దరఖాస్తుల స్వీకరణ గడువు వినాయకుడి నిమజ్జనం రోజు ఉదయం 7.00 గంటలకు ముగిస్తారు. ఈ లడ్డు వేలం పాట తొలుత రూ. 1116లతో ప్రారంభమవుతుంది. వేలంపాటలో ఈ లడ్డూ దక్కించుకున్న వారు బాండ్‌పై సంతకం చేసి.. వచ్చే ఏడాది వేలంపాటలో నగదు చెల్లించాల్సి ఉంటుంది. లడ్డూ వేలం పాట ద్వారా వచ్చిన నగదును గ్రామాభివృద్ధికి, సేవా కార్యక్రమాలకు బాలాపూర్ ఉత్సవ కమిటీ ఖర్చు చేస్తుంది.

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 17 , 2024 | 11:41 AM

Advertising
Advertising