ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

హమ్మయ్య.. ఊపిరి పీల్చుకున్న యంత్రాంగం

ABN, Publish Date - Jun 05 , 2024 | 11:38 PM

అసెంబ్లీ ఎన్నికలు ముగిసి కాస్త ఊపిరి పీల్చుకునే లోపే పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై చివరకు కౌంటింగ్‌ కూడా సజావుగా పూర్తి కావడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.

సజావుగా ఎన్నికల ప్రక్రియను ముగించిన అధికారులు

మేడ్చల్‌, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికలు ముగిసి కాస్త ఊపిరి పీల్చుకునే లోపే పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై చివరకు కౌంటింగ్‌ కూడా సజావుగా పూర్తి కావడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. నామినేషన్‌ల స్వీకరణ మొదలుకొని పోలింగ్‌, ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఉద్యోగులు భాగస్వాములై విజయవంతం చేశారు. రిటర్నింట్‌ అధికారిగా వ్యవహరించిన కలెక్టర్‌ గౌతమ్‌ నియోజకవర్గాల ఏఆర్‌ఓలతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లారు. ఉపాధ్యాయులు, రెవెన్యూ, పోలీసు, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది ఈ ప్రక్రియలో పాలుపంచుకున్నారు. మల్కాజిగిరి పార్లమెంటు స్థానానికి 22మంది అభ్యర్థులు పోటీ చేశారు. నామినేషన్ల ప్రక్రియ నుంచి ఉన్నతాధికారి మొదలు సిబ్బంది వరకు కష్టపడి పని చేశారు. రిటర్నింగ్‌ అధికారి, సహాయ రిటర్నింగ్‌ అధికారులు, సెక్టోరియల్‌, ప్రిసైడింగ్‌ అధికారులు, సూక్ష్మపరిశీలకు, బీఎల్‌ఓలు ఎన్నికల నిర్వహణలో ప్రధాన భూమిక పోషించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా నిఘా బృందాలు నిరంతరం పనిచేశాయి. ఓట్ల లెక్కింపులోనూ అధికారులు సమన్వయంతో పనిచేశారు. ఉదయం 5గంటలకే పోలింగ్‌ సిబ్బంది కీసరలోని హోళీమేరీ ఇంజినీరింగ్‌ కాలేజీకి చేరుకున్నారు. మూడో విడత ర్యాండమైజేషన్‌ ప్రక్రియ చేపట్టి నియోజకవర్గాల వారీగా ఉద్యోగులను కేటాయించారు. ఉదయం 8గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లతో లెక్కింపు ప్రక్రియ ప్రారంభించారు. రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ గౌతమ్‌ నిరంతరం పర్యవేక్షించారు. సహాయ రిటర్నింగ్‌ అధికారులు సిబ్బందితో లెక్కింపు ఆలస్యం కాకుండా చూశారు. పొరపాట్లకు తావులేకుండా చర్యలు తీసుకున్నారు. అదనపు కలెక్టర్‌ విజయేందర్‌రెడ్డి, డీఆర్వో హరిప్రియ, ఎన్నికల విభాగం అధికారి రాజేశ్వర్‌రెడ్డి తమవంతు బాధ్యతలు నిర్వహించారు. సిబ్బందికి ఎప్పటికప్పుడు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ నుంచి ఈవీఎంలను స్ర్టాంగ్‌ రూంలకు తరలించే వరకు ప్రణాళికాబద్ధంగా పనిచేసి ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేశారు.

Updated Date - Jun 05 , 2024 | 11:38 PM

Advertising
Advertising