ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కాళేశ్వరం బ్యారేజీలను ఎలా కాపాడుకోవాలి?

ABN, Publish Date - May 03 , 2024 | 04:32 AM

: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కాపాడుకోవడానికి ఏయే చర్యలు తీసుకోవాలో తగిన సిఫారసులు/సూచనలు చేయాలని జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎ్‌సఏ)

ఎన్‌డీఎ్‌సఏ నిపుణుల కమిటీకి తెలంగాణ లేఖ

హైదరాబాద్‌, మే 2 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కాపాడుకోవడానికి ఏయే చర్యలు తీసుకోవాలో తగిన సిఫారసులు/సూచనలు చేయాలని జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎ్‌సఏ) నిపుణుల కమిటీని తెలంగాణ కోరింది. వర్షాకాలానికి ముందే బ్యారేజీల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలను సూచించాలని నివేదించింది. ఈ మేరకు ఎన్‌డీఎ్‌సఏ నిపుణుల కమిటీ చైర్మన్‌ జె.చంద్రశేఖర్‌ అయ్యర్‌కు తెలంగాణ ఈఎన్సీ (జనరల్‌) జి.అనిల్‌కుమార్‌ లేఖ రాశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లకు సంబంధించిన ప్రాఽథమిక డేటాతో పాటు మేడిగడ్డలోని 6, 7, 8 బ్లాక్‌లకు సంబంధించిన ఎలకో్ట్ర రెసిస్టివిటీ టెస్ట్‌(ఈఆర్‌టీ)తో పాటు గ్రౌండ్‌ పినట్రేటింగ్‌ రాడార్‌ (జీపీఆర్‌) పరీక్షల నివేదికలను కూడా అందించినట్లు గుర్తుచేశారు. స్టేట్‌ డ్యామ్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌ (ఎస్‌డీఎ్‌సవో) కూడా బ్యారేజీల రక్షణ కోసం సూచనలు చేయాలని లేఖ రాసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఈ నెలలోనే గోదావరికి వరదలు వచ్చే అవకాశం ఉండటంతో బ్యారేజీల పునరుద్ధరణకు తగిన సిఫారసులు చేయాలని కోరారు. గతేడాది అక్టోబరు 21న మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోగా.. ఆ వెనువెంటనే అన్నారం, సుందిళ్లలో సీపేజీలు బయటపడ్డాయి. అయితే ప్రధానంగా సుందిళ్లలో సమస్య తీవ్రత తక్కువ ఉండగా.. అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలే డేంజర్‌ జోన్‌లో ఉన్నాయి. ఈ బ్యారేజీల్లో నీటి నిల్వలు తగ్గించుకోవాలని ఎన్‌డీఎ్‌సఏ గతేడాది అక్టోబరులో సూచించడంతో ఆ మేరకు చర్యలు తీసుకున్నారు. ఇక బ్యారేజీల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని ఇటీవల జ్యుడీషియల్‌ విచారణ కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ తెలంగాణ సర్కారుకుసూచనలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎన్‌డీఎ్‌సఏకు ప్రభుత్వం లేఖ రాసింది.

Updated Date - May 03 , 2024 | 08:59 AM

Advertising
Advertising