ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: నగరంలో.. 3 రూట్లలో గ్రీన్‌మెట్రో బస్సులు

ABN, Publish Date - Mar 13 , 2024 | 01:34 PM

గ్రేటర్‌లో నాన్‌ ఏసీ గ్రీన్‌మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులు మూడు రూట్లలో పరుగులు పెట్టనున్నాయి. మంగళవారం నూతనంగా ప్రారంభించిన 22 బస్సులతో ఎలక్ర్టిక్‌ బస్సుల సంఖ్య 87కు చేరింది.

హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌లో నాన్‌ ఏసీ గ్రీన్‌మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులు మూడు రూట్లలో పరుగులు పెట్టనున్నాయి. మంగళవారం నూతనంగా ప్రారంభించిన 22 బస్సులతో ఎలక్ర్టిక్‌ బస్సుల సంఖ్య 87కు చేరింది. సికింద్రాబాద్‌-మణికొండ(Secunderabad-Manikonda), సీబీఎస్-పటాన్‌చెరువు, కోఠి-పటాన్‌చెరువు రూట్లలో కొత్తబస్సులు నడిపేలా అధికారులు రూట్‌మ్యాప్‌ సిద్ధం చేస్తున్నారు. ఎలక్ర్టిక్‌ బస్సులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతీ బస్‌డిపోలో ఈవీ చార్జింగ్‌స్టేషన్లు అందుబాటులోకి తెచ్చేదిశగా ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది.

గ్రీన్‌మెట్రో ప్రత్యేకతలు ఇవే..

- 12 మీటర్ల పొడవైన ఈ-బస్సు 100 శాతం ఎలక్ర్టిక్‌ మాత్రమే కాకుండా ఎలాంటి ఉద్గారాలను వెలువరించదు. - 35 మంది సీటింగ్‌ సామర్థ్యం -ముందు, వెనుక ఎయిర్‌ సస్పెన్షన్‌ - సింగిల్‌ చార్జ్‌తో 225 కిలోమీటర్లు ప్రయాణించే సౌలభ్యం - 3-4 గంటలు చార్జింగ్‌తో వంద శాతం పూర్తి - నెల రోజుల బ్యాక్‌పతో సీసీ కమెరాలు - రివర్స్‌ పార్కింగ్‌కు సహాయక కెమెరా - అగ్నిమాపక అలారం వ్యవస్థ - వాహన ట్రాకింగ్‌ వ్యవస్థ, - సీటు పక్కన సెల్‌ చార్జింగ్‌ సదుపాయం - పబ్లిక్‌ అడ్రస్సింగ్‌ సిస్టం

Updated Date - Mar 13 , 2024 | 01:34 PM

Advertising
Advertising