Hyderabad: రేపు 4,250 బైక్‌లతో దీక్షాదివస్ వరకు ర్యాలీ
ABN, Publish Date - Nov 28 , 2024 | 08:33 AM
తెలంగాణ భవన్‌లో ఈనెల 29న దీక్షాదివస్ ను విజయవంతం చేయాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావుగౌడ్(Secunderabad MLA Teegulla Padmarao Goud) కార్పొరేటర్లు, ముఖ్యనాయకులకు సూచించారు.
- సనత్‌నగర్, సికింద్రాబాద్ నియోజకవర్గాల నుంచి బీఆర్‌ఎస్ శ్రేణులు తరలిరావాలి
- ఎమ్మెల్యేలు పద్మారావుగౌడ్, తలసాని
- సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి 1250 బైక్‌లతో..
తెలంగాణ భవన్‌లో శుక్రవారం నిర్వహించే దీక్షాదివస్ ను విజయవంతం చేయడానికి బీఆర్‌ఎస్ శ్రేణులు సమాయత్తం అవుతున్నాయి. 4,250 బైక్‌లతో ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్యేలు పద్మారావుగౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో ఈనెల 29న దీక్షాదివస్ ను విజయవంతం చేయాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావుగౌడ్(Secunderabad MLA Teegulla Padmarao Goud) కార్పొరేటర్లు, ముఖ్యనాయకులకు సూచించారు. బుధవారం సీతాఫల్‌మండి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్లు, ముఖ్యనాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో దీక్షాదివస్ కు ప్రాముఖ్యత ఉందన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: 27 రోజులుగా మృత్యువుతో పోరాడి.. చిన్నారి మృతి
సికింద్రాబాద్ నియోజకవర్గంలో అడ్డగుట్ట, తార్నాక, మెట్టుగూడ, సీతాఫల్‌మండి, బౌద్ధనగర్ మున్సిపల్ డివిజన్ల నుంచి 250 బైకుల చొప్పున కార్యకర్తలు, నాయకులు తరలిరావాలన్నారు. చిలకలగూడ నుంచి ర్యాలీగా తెలంగాణ భవన్‌కు చేరుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ కండువాలు, జెండాలు, ఇతర సామగ్రిని నాయకులకు, కార్యకర్తలకు ఎమ్మెల్యే అందజేశారు. కార్పొరేటర్లు సామల హేమ, కందిశైలజ, సునీత, ప్రసన్నలక్ష్మి, యువనాయకులు ఆలకుంట హరి, సుంకు రామచందర్, మాజీ కార్పొరేటర్ కందినారాయణ, నాయకులు బెజ్జంకి రాజేశ్, శేఖర్, సునీల్‌ముదిరాజ్, అశ్విన్, మేడిశెట్టి బాలాజీ, మురళి పాల్గొన్నారు.
సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి 3 వేల బైక్‌లతో...
మారేడుపల్లి: ఈనెల 29వ తేదీన తెలంగాణ భవన్‌లో నిర్వహించే దీక్షాదివస్ కు పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలిరావాలని సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. బుధవారం వెస్ట్ మారేడుపల్లిలోని తన కార్యాలయం వద్ద బీఆర్‌ఎస్ సనత్‌నగర్ నియోజకవర్గ స్థాయి ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ఈనెల 29న మధ్యాహ్నం నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు బైక్‌లపై బేగంపేటలోని పాటిగడ్డలోని మల్టీపర్పస్ ఫంక్షన్‌హాల్ వద్దకు చేరుకోవాలని అన్నారు.
సుమారు 3వేల బైక్‌లతో ర్యాలీగా బసవతారకం కేన్సర్ ఆస్పత్రి సర్కిల్ వద్దకు రావాలన్నారు. అక్కడి నుంచి తెలంగాణ భవన్(Telangana Bhavan)కు వెళ్లాలని తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు కొలన్ బాల్‌రెడ్డి, గుర్రం పవన్‌కుమార్‌గౌడ్, ఆకుల హరికృష్ణ, అతెల్లి శ్రీనివా్‌సగౌడ్, హన్మంతరావు, మల్లికార్జున్‌గౌడ్, తలసాని స్కైలాబ్ యాదవ్, శ్రీహరి, ఏసూరి మహేష్, సంతోష్, ప్రవీణ్ రెడ్డి, కర్నాకర్‌రెడ్డి, ఖలీల్, లక్ష్మీపతి, శేఖర్, శ్రీకాంత్‌రెడ్డి, నాగులు, కిషోర్, సురే్‌షగౌడ్, అఖిల్ పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Khammam: దంపతుల దారుణ హత్య
ఈవార్తను కూడా చదవండి: Bhatti: క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లు చేయండి
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: సరగసీ కోసం తెచ్చి లైంగిక వేధింపులు
ఈవార్తను కూడా చదవండి: బీఆర్‌ఎస్ హయాంలోనే ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు
Read Latest Telangana News and National News
Updated Date - Nov 28 , 2024 | 08:33 AM