ACB: శివబాలకృష్ణ కేసులో దూకుడు పెంచిన ఏసీబీ
ABN, Publish Date - Feb 17 , 2024 | 09:17 AM
హైదరాబాద్: ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో అరెస్టు అయిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ వ్యవహారంలో ఏబీసీ దూకుడు పెంచింది. బాలకృష్ణ బినామీలను ఏసీబీ ప్రధాన కార్యాలయానికి పిలిచి అధికారులు విచారిస్తున్నారు. బాలకృష్ణ బినామీ ఆస్తులు భారీగా బయటపడుతున్నాయి.
హైదరాబాద్: ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో అరెస్టు అయిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ వ్యవహారంలో ఏబీసీ దూకుడు పెంచింది. బాలకృష్ణ బినామీలను ఏసీబీ ప్రధాన కార్యాలయానికి పిలిచి అధికారులు విచారిస్తున్నారు. బాలకృష్ణ బినామీ ఆస్తులు భారీగా బయటపడుతున్నాయి. శుక్రవారం బాలకృష్ణకు సంబంధించిన రూ. 2.7 కోట్లు సీజ్ చేశారు. ఆయన ఫేక్ ఐటీ రిటన్స్ ఫైల్ చేసినట్టు ఏసీబీ గుర్తించింది. శివ బాలకృష్ణ భార్య రఘుదేవి పేరుతో దేవి శారీ సెంటర్ ఉంది. అలాగే మరదలు అరుణ.. సౌందర్య బోటిక్, సౌందర్య రెడీమేడ్ డ్రెసెస్ పేరుతో నకిలీ సంస్థలు ఏర్పాటు చేశారు. శివబాలకృష్ణ సోదరుడు నవీన్.. రెండు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి ఐటి రిటన్స్ ఫైల్ చేశారు. బాలకృష్ణ కూతురు పద్మావతి హోమ్ ట్యూషన్స్ పేరుతో ఐటీ రిటన్స్ ఫైల్ చేశారు. కాగా తమ భూములపై బాలకృష్ణ అక్రమంగా అనుమతులు జారీ చేశారంటూ ఏసీబీ డీజీ సివి ఆనంద్‌కు బాధితులు ఫిర్యాదులు చేశారు.
Updated Date - Feb 17 , 2024 | 09:17 AM