ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hit And Run: వరుస హిట్ అండ్ రన్ ప్రమాదాలు.. బెంబేలెత్తుతున్న హైదరాబాదీలు

ABN, Publish Date - Feb 01 , 2024 | 09:59 AM

Telangana: భాగ్యనగరంలోని వరుసగా జరుగుతున్న హిట్‌ అండ్ రన్ ప్రమాదాలతో నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. వాహనాలతో ఢీకొట్టి ఆపై ఆపకుండా పరారవుతున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ కారణంగా అనేక మంది అమాయక ప్రజలు బలవుతున్న పరిస్థితి.

హైదరాబాద్, ఫిబ్రవరి 1: భాగ్యనగరంలోని వరుసగా జరుగుతున్న హిట్‌ అండ్ రన్ ప్రమాదాలతో నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. వాహనాలతో ఢీకొట్టి ఆపై ఆపకుండా పరారవుతున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ కారణంగా అనేక మంది అమాయక ప్రజలు బలవుతున్న పరిస్థితి. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. నగరంలో వారం రోజుల వ్యవధిలో రెండు హిట్ అండ్ రన్ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.

స్పోర్ట్స్ కారుతో రెండు బైక్‌లను ఢీకొట్టి....

నిన్న(బుధవారం) జూబ్లీహిల్స్‌లో ఓ స్పోర్ట్స్ కార్ బీభత్సం సృష్టించింది. అతివేగంతో దూసుకొచ్చిన కారు.. రెండు బైక్‌లను ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం కారుతో యువకులు పరారయ్యారు. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్పోర్ట్స్ కారు గుంటూరుకు చెందిన వారిదిగా గుర్తించారు. బిక్కి అశోక్ పేరు మీద స్పోర్ట్స్ కార్ రిజిస్టర్ అయి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బిక్కి అశోక్ గుంటూరు కాటమురు ప్రాంతానికి చెందిన వ్యక్తి. దీంతో నిందితుల కోసం జూబ్లీహిల్స్ పోలీసుల బృందం గుంటూరుకు బయలుదేరింది. ఈ ప్రమాదంలో గాయపడిన ముగ్గురు వ్యక్తులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మాదాపూర్‌లోని మేడికోవర్ ఆస్పత్రిలో అన్నాచెల్లెళ్లు ఉదయ్, సుష్మ ( స్వీటీ ) చికిత్స పొందుతున్నారు. ఉదయ్, సుష్మలకు మల్టిపుల్ ఫ్యాక్చర్స్ అయినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వీరిద్దరికి ఐసీయూలో ఉంచి చికిత్స అందజేస్తున్నారు. ఈ ప్రమాదంలోనే గాయపడిన మరో వ్యక్తి ట్రీట్‌మెంట్ చేయించుకుని డిశ్చార్జ్ అయి వెళ్లిపోయినట్లు వైద్యులు తెలిపారు.


వారం క్రితమే..

కాగా.. జూబ్లీహిల్స్‌లో జనవరి 24 తెల్లవారుజామున జరిగిన హిట్‌ అండ్ రన్ ప్రమాదంలో బౌన్సర్ మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పెద్దమ్మగుడి వద్ద బైక్‌పై వెళ్తున్న వారిని అతివేగం దూసుకొచ్చి కారు ఢీకొట్టింది. అనంతరం కారు ఆపకుండానే అక్కడినుంచి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో బౌన్సర్ తారక్‌ రాం అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో బైక్ 20 అడుగుల దూరంలో ఎగిరి పడిన దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యాయి. ఈ కేసులో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదం జరిగి వారం రోజులు గడవక ముందో మరో హిట్ అండ్ రన్ కేసు నమోదు అవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 01 , 2024 | 10:23 AM

Advertising
Advertising