BJP: పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ సీరియస్ ఫోకస్.. కిషన్ రెడ్డి అధ్యక్షతన మార్చి 24న సమావేశం
ABN, Publish Date - Mar 23 , 2024 | 07:47 PM
రానున్న లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలుచుకుని ప్రధాని మోదీకి గిఫ్ట్ ఇవ్వాలనే కసితో ఉన్న బీజేపీ దళం అందుకు తగినట్లు కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ క్రమంలో ఓ వైపు ఎంపీ అభ్యర్థుల లిస్టును ఫైనల్ చేయడం, మరోవైపు ప్రచారంలో దూసుకుపోయే లక్ష్యంతో నిర్ణయాలు తీసుకుంటోంది.
హైదరాబాద్: రానున్న లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలుచుకుని ప్రధాని మోదీకి గిఫ్ట్ ఇవ్వాలనే కసితో ఉన్న బీజేపీ దళం అందుకు తగినట్లు కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ క్రమంలో ఓ వైపు ఎంపీ అభ్యర్థుల లిస్టును ఫైనల్ చేయడం, మరోవైపు ప్రచారంలో దూసుకుపోయే లక్ష్యంతో నిర్ణయాలు తీసుకుంటోంది. మార్చి 24న ఉదయం 11గంలకు కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల సమావేశం జరగనుంది.
ఈ సమావేశంలో డీకే అరుణ, బండి సంజయ్, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ తదితరులు పాల్గొననున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రచార వ్యూహాంపై బీజేపీ చర్చించనుంది. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసేలా ఒత్తిడి తీసుకురావాలని బీజేపీ నిర్ణయించింది. పార్లమెంట్ ఎన్నికలో కనీసం పది స్థానాలను గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది.
Updated Date - Mar 23 , 2024 | 07:48 PM