ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BRS: కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఆసక్తికర కామెంట్స్

ABN, Publish Date - Dec 03 , 2024 | 02:43 PM

Telangana: ‘‘పెద్దసార్‌తో(కేసీఆర్) ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలకు దూరంగా ఉంటోన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌తో టచ్‌లో ఉన్నారు. కేసీఆర్ ఓకే చెప్తే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకుంటారు’’ అంటూ ఎమ్మెల్యే వివేక్ కామెంట్స్ చేశారు. కొత్త పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తన ఉనికి కోసం ఏదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

BRS MLA Vivke

హైదరాబాద్, డిసెంబర్ 3: కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్ (BRS MLA Vivek) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పెద్దసార్‌తో(కేసీఆర్) ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలకు దూరంగా ఉంటోన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌తో టచ్‌లో ఉన్నారు. కేసీఆర్ ఓకే చెప్తే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకుంటారు’’ అంటూ కామెంట్స్ చేశారు. కొత్త పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తన ఉనికి కోసం ఏదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పీసీసీ అధ్యక్షుడు చెప్పినట్లు తాము కాంగ్రెస్‌తో టచ్‌లో లేమని తెలిపారు.

ధర 2 కోట్లు.. ఈ క్యాప్ ఎవరిదంటే..


ప్రజల పక్షాన పోరాడుతున్నందునే హారీష్ రావుపై కేసు పెట్టారని మండిపడ్డారు. ఢిల్లీలో తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం అని విమర్శించారు. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలకు మూటలు మోయడానికి రేవంత్ పనిచేస్తున్నారని.. పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని కూడా రేవంత్ విస్తరించలేకపోతున్నారన్నారు. కాంగ్రెస్‌లో చేరిన పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రేవంత్ నమ్మించి గొంతు కోశారన్నారు. కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు శాశ్వత ప్రభుత్వాలు కాదన్నారు. లిమిట్ దాటి పనిచేసే అధికారులను వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలను ఇంటిలిజెన్స్ అధికారులను బెదిరిస్తున్నారు అంటూ ఎమ్మెల్యే వివేక్ వెల్లడించారు.

పుష్ప 2 టికెట్ ధరలు పెంపుపై హైకోర్టులో విచారణ..


ఏం సాంధిచారని సంబురాలు‌ జరుపుకుంటున్నారో రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హాయాంలోనే తెలంగాణ నవంబర్ రాష్ట్రంగా నిలిచిందన్నారు. మత్స్యకారులు, నాయిని బ్రాహ్మణలు రోడ్ల మీదకు వస్తే.. ప్రత్వం సంబురాలు జరుపుతోందని మండిపడ్డారు. మత్స్యకారులు, నాయి బ్రాహ్మణులవి న్యాయమైన డిమాండ్లు అని తెలిపారు. కేసీఆర్ పథకాలనే ప్రజలు నేటికి గుర్తుచేసుకుంటున్నారన్నారు. నాయి బ్రాహ్మణల ఆందోళనలను బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మత్స్య వృత్తిపైన ఆధారపడి జీవిస్తోన్న కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చేతివృత్తుల వారికి అండగా నిలిచిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే అని చెప్పుకొచ్చారు. కోతల ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని ఎమ్మెల్యే వివేక్ వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి..

మాజీ ఎమ్మె ల్యే ద్వారంపూడికి మరో షాక్

టీడీపీలోకి వైసీపీ ముఖ్య నేత.. ఎవరంటే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 03 , 2024 | 03:55 PM