Kavitha: ఆ ఇళ్లకు ఈఎంఐలు మీరు చెల్లిస్తారా.. కవిత సూటి ప్రశ్న
ABN, Publish Date - Dec 17 , 2024 | 01:28 PM
Telangana: మూసి నది విషయంలో డీపీఆర్ ఆధారంగా అంచనా వ్యయాలు ఉంటాయని ప్రభుత్వం చెబుతోందని.. కానీ 4100 కోట్లు కావాలని ప్రపంచ బ్యాంకును ప్రభుత్వ ఆశ్రయించినట్లు నిర్ధిష్టమైన సమాచారం తమ వద్ద ఉందని మండలిలో ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రపంచ బ్యాంకును ప్రభుత్వం ఆశ్రయించిన విషయం వాస్తవమా కాదా అని ప్రశ్నించారు.
హైదరాబాద్, డిసెంబర్ 17: మూసీ నది అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకును ప్రభుత్వం ఆశ్రయించడం వాస్తవం కాదా అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) ప్రశ్నించారు. మూసీ అభివృద్ధి కోసం మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(MRDCL) ద్వారా డీపీఆర్ చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridharbabu) శాసనమండలిలో తెలిపారు. దీనిపై ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు.
సంచలన లేఖ విడుదల చేసిన మోహన్ బాబు భార్య..
మూసి నది విషయంలో డీపీఆర్ ఆధారంగా అంచనా వ్యయాలు ఉంటాయని ప్రభుత్వం చెబుతోందని.. కానీ 4100 కోట్లు కావాలని ప్రపంచ బ్యాంకును ప్రభుత్వ ఆశ్రయించినట్లు నిర్ధిష్టమైన సమాచారం తమ వద్ద ఉందన్నారు. ప్రపంచ బ్యాంకును ప్రభుత్వం ఆశ్రయించిన విషయం వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. మూసీ నది విషయంలో డీపీఆర్ తయారు కాలేదని ప్రభుత్వం ఈరోజు సభకు చెప్పిందన్నారు. ఏ తేదీన ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు సాయం కోరుతూ ప్రతిపాదనలు పంపించిందని సూటిగా ప్రశ్నించారు.
మూసి కోసం రూ 14,100 కోట్ల వ్యయం అవుతుందని, నిధులతో పాటు అనుమతులు ఇప్పించాలని ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి ఏ ప్రాతిపదికన అడిగారని అన్నారు. ఒక వేళ కేంద్రాన్ని సాయం కోరడం, ప్రపంచ బ్యాంకు సాయం కోరడం వాస్తవమైతే సభను, ప్రజలను ఎందుకు తప్పదోవపట్టిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను తప్పదోవ పట్టిస్తే అవసరమైతే... ప్రివిలేజ్ మోషన్ను ప్రవేశపెడుతామని స్పష్టం చేశారు. మూసీ నదిగర్భంలో నివసించే 309 కుటుంబాలు వాళ్లంతట వాళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారని ప్రభుత్వం చెబుతోందని.. కానీ హృదయవిదారకమైన వీడియోలను చూస్తే ప్రభుత్వం చెబుతున్నది అవాస్తవమని స్పష్టమవుతోందన్నారు.
ఈ ఏడాదిలో ఏపీలోనే సెన్సేషనల్ కేసు ఇది..
ఆ 309 కుటుంబాలు సమ్మతిస్తూ ఏవైనా పత్రాలపై సంతకాలు చేసి ఉంటే అవి సభకు అందించాలని ప్రభుత్వాన్ని కవిత డిమాండ్ చేశారు. 181 కుటుంబాలు తామంతట తామే కూల్చేసుకొని వెళ్లిపోయారని ప్రభుత్వం చెబుతోందని.. ఇది వినడానికి కూడా హాస్యాస్పదంగా ఉందన్నారు. మూసీ నిర్వాసితుల విషయంలో మానవీయ కోణంలో ఆలోచించాలన్నారు. కూలగొట్టిన ఇళ్లకు ఈఎంఐలు ఉంటే ప్రభుత్వం చెల్లిస్తుందా అంటూ ఎమ్మెల్సీ కవిత మండలిలో ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు.
ఇవి కూడా చదవండి...
BRS: అధికారులకు సంబంధం లేదు.. పూర్తి బాధ్యత నాదే: కేటీఆర్
BRS: తండ్రీకొడుకులకు ఝలక్ కేసీఆర్పై కేసు!
Read Latest Telangana News And Telugu News
Updated Date - Dec 17 , 2024 | 01:29 PM