Congress: లోక్ సభ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న కాంగ్రెస్
ABN, Publish Date - Jan 11 , 2024 | 10:01 AM
న్యూఢిల్లీ: రానున్న లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్ధం అవుతోంది. లోక్ సభ ఎన్నికలకు సన్నద్ధతపై ఏఐసీసీలో గురువారం కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ లోక్ సభ కోఆర్డినేటర్లతో సమావేశం కానున్నారు.
న్యూఢిల్లీ: రానున్న లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్ధం అవుతోంది. లోక్ సభ ఎన్నికలకు సన్నద్ధతపై ఏఐసీసీలో గురువారం కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ లోక్ సభ కోఆర్డినేటర్లతో సమావేశం కానున్నారు. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు 14 మంది కో ఆర్డినేటర్లను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు రెండేసి లోక్ సభ స్థానాలకు కో ఆర్డినేటర్లుగా ఎఐసీసీ నియమించింది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం మూడు గంటలకు ఏఐసీసీలో సమావేశం జరగనుంది.
లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ హైకమాండ్ సన్నాహక సమావేశాలను ఏర్పాటు చేసింది. ఇందులో పాల్గొనేందుకు తెలంగాణకు చెందిన పార్లమెంట్ ఇంఛార్జ్‌లు, సీనియర్ నేతలు ఈరోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. మరోవైపు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోగ్యరీత్యా ఈ సమావేశానికి హాజరుపై స్పష్టత లేదు. మిగిలిన వారంతా ఇవాళ ఉదయం దిల్లీ వెళ్లనున్నారు. దీపాదాస్ మున్షీ మాత్రం ఉదయం 7 గంటలకు హస్తినకు పయనమయ్యారు.
మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ కసరత్తులు చేస్తోంది. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు నుంచే సమాయత్తమవుతున్న ఆ పార్టీ నాయకత్వం, 17 స్థానాలను హస్తగతం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మంత్రులు, సీనియర్ నాయకులను ఇంఛార్జ్‌లుగా నియమించింది. వారు క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలతో సమావేశం అవుతూ పార్టీ బలాబలాలపై వివరాలు సేకరిస్తున్నారు.
Updated Date - Jan 11 , 2024 | 10:02 AM