Bhatti Vikramarka: విడతల వారీగా రైతుబంధు నిధులు..
ABN, Publish Date - Jan 09 , 2024 | 04:41 PM
Telangana: మేడిగడ్డపై సంబంధిత మంత్రి స్పందిస్తారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రజా భవన్‌లో ఎవరైనా రోజు ఉదయం 8:30 నుంచి 9:30 వరకు కలవొచ్చని అన్నారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ఏమీ చేయలేదని విమర్శించారు.
హైదరాబాద్, జనవరి 9: మేడిగడ్డపై సంబంధిత మంత్రి స్పందిస్తారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రజా భవన్‌లో ఎవరైనా రోజు ఉదయం 8:30 నుంచి 9:30 వరకు కలవొచ్చని అన్నారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ఏమీ చేయలేదని విమర్శించారు. ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాల ఆయకట్టు ఇస్తామని అన్నారు ఇచ్చారా? అని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూమ్‌లు అన్నారు హామీ గత ప్రభుత్వం ఏమి చేసిందని నిలదీశారు.
తాము సంపదని సృష్టిస్తామన్నారు. రైతుబంధుకి రోజు వారీగా నిధులు విడుదల చేస్తామన్నారు. ఒక ఎకరం వరకు రైతు బంధు అకౌంట్స్‌లో జమ అయ్యిందని.. 2 ఎకరాల వారికి రైతు బంధు పడుతోందని తెలిపారు. విడుతల వారీగా నిధులు విడుదల చేసి రైతు బంధు ఇస్తామని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు హామీలు చేయకపోతే బాగుండు అని బీఆర్ఎస్ నేతలు కోరుకుంటున్నారని భట్టి విక్రమార్క వ్యాఖ్యలు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Jan 09 , 2024 | 04:41 PM