ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

DK Aruna: దేశంలోనే అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగింది..

ABN, Publish Date - Jan 07 , 2024 | 01:58 PM

హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిందని బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు సీబీఐ విచారణ కోరి‌న‌ కాంగ్రెస్.. ఇప్పుడెందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు.

హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిందని బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు సీబీఐ విచారణ కోరి‌న‌ కాంగ్రెస్.. ఇప్పుడెందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. జ్యూడిషియల్ ఎంక్వయిరీతో కాలయాపన చేయాలని చూస్తోందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రూ. లక్ష కోట్లకు అంచనాలు పెంచి... వేలకోట్ల అవితికి పాల్పడ్డారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వం అవినీతిపై సీబీఐతో విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారం చూస్తుంటే కేసీఆర్‌ను కాపాడాలని చూస్తోందని, గతంలో సీబీఐ విచారణ జరిపించాలంటూ చెప్పి.. సీఎం కుర్చీ ఎక్కగానే రేవంత్ రెడ్డి మాట మార్చారని డీకే అరుణ అన్నారు. ప్రాజెక్ట్ వ్యయాన్ని రూ. 63,000 కోట్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 1.50 లక్షల కోట్లకు పెంచిందని అన్నారు. హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జర్పించడం కంటే సీబీఐ విచారణ జరిపిస్తే నిజాలు బయటపడతాయని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్దఎత్తున అవినీతికి పాల్పడిందని గతంలో రేవంత్ రెడ్డి ఆరోపించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. సీబీఐ విచారణ కోరుతూ.. సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు లేఖ రాయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ, కాళేశ్వరం కుంభకోణాలపై దర్యాప్తు చేయించడంలో కాంగ్రెస్ జాప్యం చేస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏదో స్పష్టం చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.

Updated Date - Jan 07 , 2024 | 01:58 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising