ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: గుడి ముందు మాంసం కవర్.. ఆ తరువాత ఏం జరిగిందంటే

ABN, Publish Date - Oct 14 , 2024 | 11:20 AM

మాసబ్‌ట్యాంక్‌ దగ్గర ఓ గుడి ముందు మాంసం కవర్ పడి ఉండటంపై భక్తులు విస్మయం వ్యక్తం చేశారు. ఎవరో కావాలని చేసిన పనిగా అనుమానించారు. అయితే ఈ ఘటనపై హైదరాబాద్ పోలీసులు సోమవారం స్పందించారు.

హైదరాబాద్: మాసబ్‌ట్యాంక్‌ దగ్గర ఓ గుడి ముందు మాంసం కవర్ పడి ఉండటంపై భక్తులు విస్మయం వ్యక్తం చేశారు. ఎవరో కావాలని చేసిన పనిగా అనుమానించారు. అయితే ఈ ఘటనపై హైదరాబాద్ పోలీసులు సోమవారం స్పందించారు. గుర్తు తెలియని వ్యక్తులు మాంసం కవర్‌ని పడేశారనడం పూర్తిగా అవాస్తవమని తేల్చారు. ఇందుకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీని విడుదల చేశారు. ఓ భక్తుడి నుంచి విషయం తెలియగానే తొలుత పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

అనంతరం దర్యాప్తు చేపట్టారు. అయితే ఆలయానికి సమీపంలో ఉన్న చెత్త కుప్పలో నుంచే ఆ కవర్ వచ్చి ఉంటుందని అనుమానించారు. దీంతో అంతకుముందు రాత్రి ఏం జరిగిందనేది తెలుసుకోవడానికి సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేశారు. శునకాల గుంపు అటుగా వెళ్తుండటం సీసీ కెమెరాలో రికార్డయింది. అందులోని ఓ కుక్క మాంసం కవర్‌ని నోట కరుచుకుని రోడ్డుకు మరోవైపు దాటింది.


అనంతరం గుడి ముందు వదిలేసి పారిపోయింది. ఇందుకు సంబంధించి దృశ్యాలు సీసీ కెమెరా ఫుటేజ్‌లో కనిపిస్తున్నాయి. కావాలనే మాంసం ఉన్న కవర్ వదిలి వెళ్లారనే వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తలు ఫేక్ అని పోలీసులు తేల్చేశారు. ఈ ఘటనపై ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేయకూడదని హెచ్చరించారు. సోషల్ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కామెంట్లు, పోస్టులు, వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు.

IT Corridor: ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌

MMTS: ఎంఎంటీఎస్ సర్వీసుల్లో భారీ కోత.. నాడు 175.. నేడు 70

Hyderabad: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. కేబీఆర్‌ పార్కు వద్ద అతిపెద్ద అండర్‌పాస్‌

For Latest News and National News click here

Updated Date - Oct 14 , 2024 | 11:47 AM