HarishRao: కేసీఆర్ ప్రజల్లోకి ఎప్పుడు రానున్నారో చెప్పిన హరీష్‌రావు
ABN, Publish Date - Jan 06 , 2024 | 02:48 PM
Telangana: తెలంగాణ భవన్‌లో పెద్దపల్లి పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కోలుకుంటున్నారని అన్నారు. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యవంతుడై ప్రజల మధ్యలోకి వస్తారని తెలిపారు. ఫిబ్రవరిలో తెలంగాణ భవన్‌కు వచ్చి ప్రతి రోజూ కార్యకర్తలను కలుస్తారన్నారన్నారు. త్వరలోనే కేసీఆర్ జిల్లాల పర్యటనలు ఉంటాయని వెల్లడించారు.
హైదరాబాద్, జనవరి 6: తెలంగాణ భవన్‌లో శనివారం పెద్దపల్లి పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్‌రావు (Former Minister Harish Rao)మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ (BRS Chief KCR) కోలుకుంటున్నారని అన్నారు. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యవంతుడై ప్రజల మధ్యలోకి వస్తారని తెలిపారు. ఫిబ్రవరిలో తెలంగాణ భవన్‌కు వచ్చి ప్రతి రోజూ కార్యకర్తలను కలుస్తారన్నారన్నారు. త్వరలోనే కేసీఆర్ జిల్లాల పర్యటనలు ఉంటాయని వెల్లడించారు. కేసీఆర్ కిట్ మీద కేసీఆర్ గుర్తును కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) చెరిపేస్తోందన్నారు. కేసీఆర్ గుర్తును కేసీఆర్ కిట్ నుంచి తొలిగిస్తారేమో కానీ తెలంగాణ ప్రజల గుండెల నుంచి తొలగించలేరని అన్నారు.
కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రద్దు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రద్దులు, వాయిదాలు అన్నట్టుగా నడుస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ విపరీత చర్యలపై ఉద్యమిస్తామన్నారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగితే ఎమ్మెల్యేలం అంతా బస్సు కట్టుకుని బాధితుల దగ్గరకు వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ఈ ప్రభుత్వ తీరు చూస్తుంటే ఏడాదిలోనే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదనిపిస్తోందన్నారు. కొన్ని చోట్ల వడ్ల పైసలు కూడా పడలేదని, రైతుబంధు కూడా వేయలేదన్నారు. రైతు వ్యవసాయం ఎలా చేయాలని ప్రశ్నించారు. అభివృద్ధి చేసినా దుష్ప్రచారం వల్ల ఓడిపోయామన్నారు. ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమే అని చెప్పుకొచ్చారు. ‘‘తొలిసారి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం.. మన సత్తా ఏమిటో చూపిద్దాం’’ అని సమావేశంలో హరీష్‌రావు పేర్కొన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Jan 06 , 2024 | 02:48 PM