ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ganesh Laddu Record: రికార్డులన్నీ బ్రేక్.. సంచలన ధర పలికిన గణేశుడి లడ్డూ

ABN, Publish Date - Sep 17 , 2024 | 08:45 AM

వినాయక చవితి వచ్చిందంటే ఊరూ వాడ అంతటా సందడే సందడి. భక్తి శ్రద్ధలతో పూజలు, ఉత్సవాలు.. అన్న ప్రసాద కార్యక్రమాలు ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. ఇక ఉత్సవాలు ముగింపులో జరిగే గణేశుడి లడ్డూ ప్రసాద వేలం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తుంటుంది.

బండ్లగూడ: వినాయక చవితి వచ్చిందంటే ఊరూ వాడ అంతటా సందడే సందడి. భక్తి శ్రద్ధలతో పూజలు, ఉత్సవాలు.. అన్న ప్రసాద కార్యక్రమాలు కోలాహలంగా జరుగుతుంటాయి. ఇక ఉత్సవాలు ముగింపులో జరిగే గణేశుడి లడ్డూ ప్రసాద వేలం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తుంటుంది. ప్రతి సంవత్సరం సరికొత్త రికార్డులు నమోదవుతున్న నేపథ్యంలో ఈసారి రికార్డులు బ్రేక్ అవుతాయా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ సంచలనం నమోదయింది.


వినాయకుడి లడ్డూ ప్రసాదం ఏకంగా రూ.1.87 కోట్ల ధర పలికింది. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ మున్సిపల్ పరిధిలో ఉన్న కీర్తి రిచ్ మండ్ విల్లాస్‌లో నిర్వహించిన లడ్డూ వేలంలో ఈ రికార్డు స్థాయి నమోదయింది. దీంతో గణేశుడి లడ్డూ ధర రికార్డులన్నీ బ్రేక్ అయ్యాయి. కాగా గతేడాది ఇక్కడి లడ్డూ రూ.1.20 కోట్లు పలికిన విషయం తెలిసిందే. పోయిన సంవత్సరం లడ్డూ ధర ఏకంగా రూ.67 లక్షల మేర పెరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.


చూపంతా బాలాపూర్ గణేశ్ లడ్డూపైనే..

బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంలో ఎంత ధర పలకనుందనేది ఆసక్తికరంగా మారింది. భక్తులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంలో ఒక ఆనవాయితీ కొనసాగుతోంది. ఒకసారి బాలాపూర్ గ్రామ ప్రజలకు, ఒకసారి ఇతరులకు లడ్డూను వేలంలో ఇస్తున్నారు. గత సంవత్సరం బయట వ్యక్తి అయిన దయానంద రెడ్డి రూ.27 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. మరి ఈసారి బాలాపూర్ లడ్డూ ఎవరు కైవసం చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.


బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంలో ఉన్న భక్తులు వీళ్లే..

1. లింగాల దశరథ్ గౌడ్ (కర్మాన్‌ఘాట్)

2. అర్బన్ గ్రూప్ - సామా ప్రణీత్ రెడ్డి (సాహెబ్ నగర్)

3. సందీప్ రెడ్డి - ఎస్‌వై‌ఆర్ ఫౌండేషన్ (పోచారం)

4. కొలన్ శంకర్ రెడ్డి (బాలాపూర్)

5. శ్రీ గీత డైరీ-లక్ష్మీనారాయణ (నాదర్గుల్)

6. సామ కార్తీక్ రెడ్డి, వర్ధన్ రెడ్డి, విక్రమ్ రెడ్డి బ్రదర్స్

Updated Date - Sep 17 , 2024 | 09:12 AM

Advertising
Advertising