Ganesh Immerions: వచ్చే ఏడాదైనా మానుకోండి.. వినాయకుడి భక్తులకు సీపీ ఆనంద్ కీలక విజ్ఞప్తి
ABN, Publish Date - Sep 18 , 2024 | 12:00 PM
భాగ్యనగరం హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనాలపై సీపీ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడారు. కొందరు శోభాయత్రలను సెలవు రోజు అర్ధరాత్రి, తెల్లవారుజామున మొదలుపెడుతున్నారని, ఇలా చేయడంతో నిమజ్జనం మరుసటిరోజు సాయంత్రం వరకు జరుగుతోందని అన్నారు.
హైదరాబాద్: భాగ్యనగరం హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనాలపై సీపీ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడారు. కొందరు శోభాయత్రలను సెలవు రోజు అర్ధరాత్రి, తెల్లవారుజామున మొదలుపెడుతున్నారని, ఇలా చేయడంతో నిమజ్జనం మరుసటిరోజు సాయంత్రం వరకు జరుగుతోందని అన్నారు. ఈ కారణంగా నిమజ్జనం ఆలస్యం అవడంతో పాటు సామాన్య జనాలకు కూడా ఇబ్బంది అవుతోందని, వచ్చే ఏడాది నుంచైనా ఈ పద్ధతి మానుకోవాలని సూచించారు. వినాయక నిమజ్జనం కోసం ప్రభుత్వం ఒకరోజు సెలవు కూడా ఇస్తోందని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
Updated Date - Sep 18 , 2024 | 12:00 PM