ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

HYDRA: అక్రమార్కులపై హైడ్రా ఉక్కుపాదం.. అమీన్‌పూర్‌లో వైసీపీ నేత ఆక్రమణల కూల్చివేత

ABN, Publish Date - Sep 08 , 2024 | 11:57 AM

ఆక్రమణలు చేసిన అక్రమార్కుల పాలిట ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా(HYDRA) ఆదివారం మరిన్ని కూల్చివేతలు చేపట్టింది. అమీన్ పూర్ పెద్ద చెరువు వద్దకు చేరుకున్న హైడ్రా అధికారులు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చేస్తు్నారు.

హైదరాబాద్: ఆక్రమణలు చేసిన అక్రమార్కుల పాలిట ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా(HYDRA) ఆదివారం మరిన్ని కూల్చివేతలు చేపట్టింది. అమీన్ పూర్ పెద్ద చెరువు వద్దకు చేరుకున్న హైడ్రా అధికారులు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చేస్తు్నారు. ఆక్రమణలతో అమీన్‌పూర్ పెద్ద చెరువు కుంచించుకుపోయినట్లు అధికారులు గుర్తించారు. దీంతో రంగంలోకి దిగి.. ఎఫ్టీఎల్‌లో నిర్మించిన ప్రహరీ గోడను కూల్చివేస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. ప్రహరీ గోడ ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వైసీపీ నేత కాటసాని రాంభూపాల్‌రెడ్డికి చెందిందిగా సమాచారం.


ఆయన కొన్నేళ్ల క్రితం 20 ఎకరాల భూమి కొనుగోలు చేసి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించినట్లు తెలుస్తోంది. అయితే ప్రహరీ ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఉన్నట్లు గుర్తించి కూల్చివేతలు చేపట్టారు. ఇంకోపక్క.. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట్ కార్వా చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లో నిబంధనలకు విరుద్ధంగా విల్లాలు నిర్మించినట్లు అధికారులు గతంలోనే గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం మల్లంపేట్‌లోని లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ విల్లాలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. దీంతో ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు.తహసీల్దార్ మతిన్ మాట్లాడుతూ.. "కత్వా చెరువులో 20కి పైగా అనధికారిక విల్లాలను గుర్తించాం. ప్రస్తుతం 8 విల్లాలను కూలుస్తున్నాం. మిగిలిన విల్లాలను ఖాళీ చేయించి కూల్చేయిస్తాం. జరిగేషన్ శాఖ నిర్దేశించిన మార్కు ప్రకారం నోటీసులిచ్చి కూలుస్తాం" అని వెల్లడించారు.


సున్నం చెరువులో..

అమీన్‌పూర్‌లో కూల్చివేతలు జరుగుతుండగానే మాదాపూర్‌లోని సున్నం చెరువు చుట్టూ ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు హైడ్రా సిద్ధమైంది. అయితే స్థానికులు కూల్చివేతలను అడ్డుకున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తూన్నారంటూ ఇళ్ల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయల విలువ చేసే సామగ్రి ధ్వంసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

జయభేరికి నోటీసులు నిజమే..

హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ.. "నానక్ రామ్ గూడ రంగలాల్ చెరువు లో మురళీ మోహన్ జయభేరి నిర్మాణాలకు నోటీసులు జారీ చేశాం. ఫిర్యాదులు రావడంతో చెరువును పరిశీలించాం. వారంలో రోజుల్లో FTL లో నిర్మాణాలను తొలిగించేందుకు జయభేరి సంస్థ గడువు కోరింది. ఆక్రమణలు తొలగించకపోతే హైడ్రా కూల్చివేతలు చేస్తుంది" అని పేర్కొన్నారు.

Updated Date - Sep 08 , 2024 | 12:05 PM

Advertising
Advertising