ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gutha: ఎమ్మెల్యేలను ప్రజలకు దూరం చేస్తోంది వారే.. గుత్తా సంచలన కామెంట్స్

ABN, Publish Date - Dec 11 , 2024 | 01:35 PM

Telangana: ఎమ్మెల్యేలు ప్రజలకు దూరం అవ్వడానికి, ఎన్నికల్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం పీఏలు, పీఆర్ఓలు అంటూ శాసనమండలి చైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలతో ప్రజాప్రతినిధులను దూరం చేయడానికి మొదటి కారణం పీఏలు, పీఆర్ఓలు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే కోసం ఎవరైనా ఫోన్ చేస్తే పీఏలు, పీఆర్ఓలు దురుసుగా మాట్లాడుతారన్నారు.

Legislative Council Chairman Gutha Sukhender Reddy

హైదరాబాద్, డిసెంబర్ 11: ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు శిక్షణ తరగతులతో ప్రజాప్రతినిధులకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Legislative Council Chairman Gutha Sukhender Reddy) సూచనలు చేశారు. బుధవారం ఎమ్‌సీహెచ్‌ఆర్‌డీలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు ప్రజలకు దూరం అవ్వడానికి, ఎన్నికల్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం పీఏలు, పీఆర్ఓలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలతో ప్రజాప్రతినిధులను దూరం చేయడానికి మొదటి కారణం పీఏలు, పీఆర్ఓలు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే కోసం ఎవరైనా ఫోన్ చేస్తే పీఏలు, పీఆర్ఓలు దురుసుగా మాట్లాడుతారన్నారు. కాబట్టి ఎమ్మెల్యేలు ఫోన్లో అందరితో టచ్‌లో ఉండాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచనలు చేశారు.

AP highcourt: అదానీతో విద్యుత్ ఒప్పందాలపై హైకోర్టులో విచారణ.. ఏం జరిగిందంటే



ప్రస్తుత రాజకీయాలను చూస్తే ఆవేదన కలుగుతోందన్నారు.ర గాలివాటం రాజకీయాలు మొదలయ్యాక కొత్త ఎమ్మెల్యేలే సభలోకి వస్తున్నారన్నారు. ‘‘మన ఫోన్లు మనమే ఎత్తుకోవడం అలవాటు చేసుకోవాలి. మన పీఏ, పీఆర్ఓలు కూడా ఫోన్లు వస్తే కసురుకుంటున్నారు. గన్ మెన్‌లతో కూడా ప్రజల్లో కొంత వ్యతిరేకత వస్తోంది. గెలవగానే పక్కకి వచ్చి చేరే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఎన్నికలు కాస్ట్లీగా మారిపోయాయి. మేం సభాపతిగా ఉన్నా సభ ఎన్ని రోజులు నడపాలనే నిర్ణయం ప్రభుత్వానిది. ప్రభుత్వం ఎక్కువ రోజులు సభ నిర్వహించాలనుకుంటే ఎక్కువ రోజులు నడుస్తుంది’’ అంటూ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.


ఆ అవార్డు‌ను పరిశీలిస్తున్నాం: స్పీకర్

చట్టాలను రూపొందించే హక్కు శాసన సభ్యులకు ఉంటుందని స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. ఎమ్మెల్యే శిక్షణా తరగతుల్లో స్పీకర్ మాట్లాడుతూ.. గతంలో శాసనసభ సమావేశాలు ఉంటే సినిమా రిలీజ్ వాయిదా వేసుకునేవారన్నారు. ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి గొప్ప వ్యక్తులు బాగా మాట్లాడి మంచి పేరు తెచ్చుకున్నారని తెలిపారు. ఉత్తమ పార్లమెంటరీయన్ లెక్క ఉత్తమ శాసనసభ వ్యక్తి అవార్డు పరిశీలన చేస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్ వెల్లడించారు.


శాసనసభ ఏ ఒక్కరిదో కాదు: మంత్రి శ్రీధర్ బాబు

మొదటిసారి ఎన్నికైన శాసనసభ్యులు 57 మంది శాసన సభలో ఉన్నారని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. శాసనసభ అందరికీ అని... కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌దో వేరే ఇంకా ఎవరిదో కాదన్నారు. శాసనసభ ఏ ఒక్కరిదో కాదని... ఈ ట్రైనింగ్ సెషన్స్‌కు అందరికీ ఆహ్వానం పంపామని తెలిపారు. పాత రోజుల్లో సిద్ధాంతపరంగా భేదాభిప్రాయాలు ఉన్నా... సభలో ఎవరి పాత్ర వారు పోషించారన్నారు. ‘‘నేను మొదటిసారి ఎన్నికైనప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది. నేను నాలుగోసారి సభలో ఉన్నప్పుడు పీఏసీ ప్రతిపక్షానికి ఇవ్వలేదు. ఎమ్మెల్యేలు అందరూ శాసనసభకు హాజరయ్యే సాంప్రదాయం కొనసాగించాలి. ఎమ్మెల్యేగా గెలిచి సభ రాకుండా దూరంగా ఉండకండి. ఎప్పుడు మాట్లాడే అవకాశం దొరుకుతుందా అనే దాని కోసం చూసే వాళ్ళం’’ అని మంత్రి శ్రీధర్ బాబు చెప్పుకొచ్చారు. కాగా.. రెండు రోజుల పాటు జరగనున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల శిక్షణా తరగతుల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.


ఇవి కూడా చదవండి...

Kadapa: రాఘవరెడ్డి విచారణ.. ఎంపీ అవినాష్‌ మెడకు బిగుస్తున్న ఉచ్చు

సంచలన విషయాలు బయటపెట్టిన మనోజ్..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 11 , 2024 | 01:46 PM