Komatireddy: సోనియాకు కృతజ్ఞతలు తెలపరా.. కేసీఆర్‌పై కోమటిరెడ్డి ఫైర్
ABN, Publish Date - Dec 09 , 2024 | 02:51 PM
Telangana: ‘‘తెలంగాణ ఇచ్చాక 14 మంది కుటుంబంతో వెళ్ళి కాళ్ళు మొక్కి గ్రూప్ ఫోటో దిగినవ్. అసెంబ్లీలో తెలంగాణ ఇచ్చిన దేవత అని, సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ రాదు అని అన్న కేసీఆర్ ఈరోజు అసెంబ్లీకి ఎందుకు రాలేదు’’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే నైతికత లేదన్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 9: తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ పుట్టినరోజున అసెంబ్లీకి వచ్చి ఆమెకు కృతజ్ఞతలు తెలపరా అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మంత్రి మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ఇచ్చాక 14 మంది కుటుంబంతో వెళ్ళి కాళ్ళు మొక్కి గ్రూప్ ఫోటో దిగినవ్. అసెంబ్లీలో తెలంగాణ ఇచ్చిన దేవత అని, సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ రాదు అని అన్న కేసీఆర్ ఈరోజు అసెంబ్లీకి ఎందుకు రాలేదు’’ అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే నైతికత లేదన్నారు.
Botsa: సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన బొత్స
‘‘మేము ఇప్పటికి టీపీపీపీ అని చెప్పుకుంటాం. నువ్ నీ పార్టీ లో “టీ’’ తీసేసి బీఆర్‌ఎస్ అని పెట్టుకున్నావ్’’ అంటూ విమర్శించారు. నిజామాబాద్ జిల్లాకు వెళ్ళినప్పుడు రివ్యూకు ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే రాలేదన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ ఇంచార్జి వచ్చి రోడ్డు సమస్య ఉంది అని చెప్పారు. అందులో ఏం తప్పు ఉంది. నా కొడుకు మృతికి ఎంత బాధ పడ్డానో.. బ్రాహ్మణ వెల్లమ్ ప్రాజెక్టు పూర్తి చేయాలని అంతే బాధ పడ్డాను’’ అని తెలిపారు.
వెంకన్న జన్మ ధన్యమైంది: భట్టి
బ్రాహ్మణ వెల్లమ్ ప్రాజెక్టు కోసం కోమటిరెడ్డి 2004 నుంచి పోరాడుతున్నారని.. ఇపుడు నిధులు ఇచ్చి పూర్తి చేశామని దాంతో వెంకన్న జన్మ ధన్యమైందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మీడియాతో చిట్‌చాట్‌లో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఉన్న ఆయన సన్నిహితులను తీసుకెళ్లి ప్రాజెక్టును చూపించాలన్నారు. వైఎస్‌ఆర్‌తో కోట్లాడి కోమటిరెడ్డి ప్రాజెక్టు మంజూరు చేపించుకున్నారని గుర్తుచేశారు. నల్గొండ జిల్లా కూడా గోదావరి తరహాలో నీళ్లు పారబోతున్నాయన్నారు. భూమి ధరలు భారీగా పెరగబోతున్నాయన్నారు. నాకు, తలా ఒక ఎకరం ఇవ్వవా అంటూ ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని డిప్యూటీ సీఎం అడిగారు.
కేటీఆర్‌కు మాకు పోలికేంటి: కోమటిరెడ్డి
‘‘భట్టి విక్రమార్క జిల్లా పర్యటనలో ఉన్నప్పుడు ఏం అడిగినా ఒకే అంటున్నారు... సెక్రటేరియట్‌లో మాత్రం పని కోసం వస్తే పైసలు లేవంటున్నారని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. డైట్ చార్జీలు పెంచడం వల్ల మంచి జరిగిందని మంత్రులు తెలిపారు. ఈ నెల 15, 16వ తేదీల్లో అన్ని హాస్టల్స్‌లలో జిల్లా కలెక్టర్ల లంచ్ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు మంత్రులు తెలిపారు. పదేళ్లు బీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యార్థుల డైట్ చార్జీలు పెంచలేదని భట్టి అన్నారు. రెసిడెన్సిల్ స్కూల్స్ కట్టి విద్యార్థులకు అందిస్తే చరిత్రలో నిల్చిపోతామని కోమటిరెడ్డి అన్నారు. వైఎస్ఆర్ సమయంలో ఆర్థిక క్రమశిక్షణ ఉండేదని... మళ్ళీ ఇప్పుడు భట్టి దగ్గర కనిపిస్తోందని తెలిపారు. ‘‘కేసీఆర్ లేకుండా కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యేవాడా? కేటీఆర్‌కు మాకు పోలిక ఏంటి?’’ అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి...
రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన చరిత్ర బీఆర్‌ఎ్‌సదే
ఎస్సై ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. వీడియో విడుదల.
Read Latest Telangana News And Telugu News
Updated Date - Dec 09 , 2024 | 02:53 PM